Begin typing your search above and press return to search.
కరోనా గురించి తెలియని పర్యాటక ప్రాంతం .. నేటికీ ఒక్క కేసు కూడా నమోదు కాలేదట !
By: Tupaki Desk | 10 Dec 2020 1:30 PM GMTకరోనా వైరస్ .. ప్రపంచంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఎందుకంటే ఈ మహమ్మారి విజృంభణ అలా కొనసాగింది. చైనా లో మొదలైన ఈ మహమ్మారి వ్యాప్తి ఆ తర్వాత ఒక్కొక్క దేశానికీ వ్యాప్తిస్తూ , ప్రపంచం మొత్తం అల్లుకుపోయింది. ఈ సమయంలో కరోనా నుండి తప్పించుకోవడానికి లాక్ డౌన్ ను అమల్లోకి తీసుకువచ్చారు. ఇన్ని జరుగుతున్నా కూడా ఓ పర్యాటక ప్రాంతం లో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదట. అలాగే అక్కడి వారికి అసలు కరోనా అంటేనే ఏమిటో కూడా తెలియదట. అసలు కరోనా కేసులు లేని ఆ పర్యాటక ప్రాంతం విశేషాలు ఏవో చూద్దాం...
ఇప్పటివరకు కరోనా కేసులు నమోదు కాని భారతదేశానికి చెందిన ఆ అందమైన పర్యాటక ప్రాంతంలో మాత్రం ప్రజలు సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాని ఆ సుందర ప్రాంతం లక్షద్వీప్ . దేశంలో కరోనా కోరలు చాచుకొని ఉంటే, లక్షద్వీప్ లో మాత్రం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. దీనితో అక్కడ అన్ని కూడా యధావిధిగా సాగిపోతున్నాయి. భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలలో ఒకటైన లక్షద్వీప్ లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని, లోక్ సభ లో లక్షద్వీప్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ మొహమ్మద్ ఫైజల్ తెలిపారు. అక్కడ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు అని తెలిపారు.
అరేబియా సముద్రంలో ఉన్న లక్ష ద్వీపానికి పర్యాటక ప్రాంతంగా గుర్తింపు ఉంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రారంభంలోనే పర్యాటకుల రాక పై ఆంక్షలు విధించిన నేపథ్యంలో లక్షద్వీప్ కరోనా నుంచి బయటపడినట్లుగా భావిస్తున్నారు. భారతదేశమంతా కరోనా నిబంధనలు విధించినా, అలాంటి నిబంధన ఏమీ లేకుండా సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నది లక్షద్వీప్ వాసులు మాత్రమేనని ఆయన చెప్పారు. దేశంలోనే అతి చిన్న యూటీఐ లక్షద్వీప్, 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కేరళ తీర నగరమైన కొచ్చి నుండి 220 నుండి 440 కిలోమీటర్ల దూరంలో ఉంది. లక్షద్వీప్ జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం 64,000 గా ఉంది.
దేశంలో తోలి కరోనా కేసు నమోదు అయిన సమయంలో, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, పర్యాటకుల రాక ఆపడం ద్వారా కరోనా వ్యాప్తి నివారించగలిగామని ఎంపీ చెబుతున్నారు. ఎంట్రీ పర్మిట్ జారీ చేయడాన్ని తగ్గించడం ద్వారా, ద్వీపవాసులు కానివారు లక్షద్వీప్ కు రావడాన్ని నియంత్రించామని, ఇతర ప్రాంతాలలో మరియు విదేశాలలో పనిచేసే లక్ష ద్వీపవాసుల ప్రవేశం కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని రూపొందించామని, దీని ప్రకారం, లక్షద్వీప్ కు రావాలనుకునే వారు కొచ్చిలో ఏడు రోజుల క్వారంటైన్ ను పూర్తి చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన ఖర్చును లక్షద్వీప్ భరిస్తుందని తెలిపారు. అలా చేయడం వల్లే ఈ రోజుకి కూడా అక్కడ ఒక్క కరోనా కేసు కూడా లేదు అని తెలిపారు.