Begin typing your search above and press return to search.

సీఎంను దించేయాల్సిందే..మొదలైన అసమ్మతి

By:  Tupaki Desk   |   16 Sep 2020 12:30 AM GMT
సీఎంను దించేయాల్సిందే..మొదలైన అసమ్మతి
X
పొత్తుల సంసారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగేసి.. దాచేసి కర్ణాటకలో అతికష్టం మీద సర్కార్ ను ఏర్పాటు చేసిన బీజేపీలో కూడా ఇప్పుడు అసమ్మతి గళాలు బయటపడుతున్నాయి. ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా ఎన్ని రోజులు ఆ కుర్చీలో ఉంటాడనే దానిపై రోజుకో రకమైన విశ్లేషణలు ఊపందుకున్నాయి.

75 ఏళ్లు నిండిన వారికి బీజేపీలో మంగళం పాడేస్తున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక సీఎం యడ్యూరప్పను సైతం సాగనంపలానే డిమాండ్ కన్నడ నాట వినిపిస్తోంది.

75 ఏళ్లు నిండిన యడ్యూరప్ప పార్టీ సిద్ధాంతాల ప్రకారం ముఖ్యమైన పదవుల్లో కొనసాగరాదని బీజేపీలోని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.ఎంత త్వరగా యడ్యూరప్పను సాగనంపితే తాము ఆ పీఠాన్ని అధిరోహించాలని బీజేపీలో అంతర్గత పోరాటం మొదలైనట్లుగా అక్కడ ప్రచారం సాగుతోంది.

యడ్యూరప్పను దించేయాలని చూస్తున్న వారిలో మాజీ సీఎంలు, సీనియర్ మంత్రులు కూడా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు అదిష్టానానికి వినతులు కూడా పంపుతున్నారట.. ఈ క్రమంలోనే మాజీ సీఎం, ప్రస్తుత మంత్రి జగదీష్ శెట్టర్ ఢిల్లీ పర్యటన ఆసక్తిరేపుతోంది.

కన్నడనాట అసంతృప్తి పెరిగిపోతుండడంతో సీఎం యడ్యూరప్ప ఈనెల 17న ఢిల్లీ వెళుతున్నారు. దీంతో కన్నడ పాలిటిక్స్ లో మళ్లీ హీట్ పెరిగింది.