Begin typing your search above and press return to search.
అగ్రదేశాల ఫైట్.. వేదిక: అంగారక గ్రహం
By: Tupaki Desk | 18 Feb 2021 5:00 AM ISTఅంగారకుడిపై జీవం ఉందనే విషయంపై కొంతకాలంగా పరిశోధనలు సాగుతున్న విషయం తెలిసిందే. అయితే అంగారక గ్రహంపై ఇప్పటికే పలు దేశాలు పరిశోధనలు సాగిస్తాయి. అమెరికా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అంగారక గ్రహంపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నాయి. అంగారకుడిపై జీవరాశి ఉండేందుకు అవకాశం ఉందా? తదితర కారణాలను తెలుసుకొనేందుకు ఈ మూడు దేశాలు పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. గతంలోనే పరిశోధనలు మొదలు పెట్టాయి కూడా ఈ మూడు దేశాలు ప్రయోగించిన స్పేస్‌క్రాఫ్ట్స్ త్వరలో అక్కడ లాండ్ కాబోతున్నాయి.
నాసా పంపించిన ఓ మినీ హెలికాప్టర్ ఇప్పటికే అంగారకుడిపైకి వెళ్లింది. ఈ హెలికాప్టర్ అంగారక గ్రహం ఉపరితలంపై తవ్వకాలు జరుపనున్నది. దీని కోసం నాసా శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఓ రోబో హ్యాండ్‌ను దీనికి అమర్చారు. 1800 గ్రాముల బరువులో హెలికాప్టర్‌ను పోలి ఉన్న ఈ ల్యాండ్ రోవర్‌ను ఐఐటీ-మద్రాస్ ఆలమ్నీ బాబ్ బలరాం రూపొందించారు. అయితే ఈ పరికరం అక్కడి మట్టిని, రాళ్లను సేకరించనున్నది.
మరోవైపు యూఏఈకూడా హోప్ రోవర్ అంగారక గ్రహం కక్ష్యలోకి వెళ్లిపోయింది. అది ఫొటోలను కూడా పంపించింది. హోప్ పేరుతో ఎమిరేట్స్ పంపించిన ఈ స్పేస్ క్రాఫ్ట్ తీసిన తొలి ఫొటోను ఎమిరేట్స్ శాస్త్రవేత్తలు విడుదల చేశారు. ఇప్పటిదాకా వెలుగులోకి రాని అంగారకుడి సరికొత్త రూపాన్ని హోప్ స్పేస్‌క్రాఫ్ట్ చిత్రీకరించింది.
చైనా కూడా తియాన్వెన్-1 స్పేస్ క్రాఫ్ట్ వారం రోజుల కిందటే అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించింది. అయితే ఇది కూడా అంగారకుడిపై ఫొటోలను తీయనుంది. మూడు అగ్రదేశాలు దాదాపుగా ఒకేసారి అంగారక గ్రహంపై దృష్టి కేంద్రీకరించడం ఆసక్తికరంగా మారింది. ఈ మూడు దేశాల ప్రయోగాలు సక్సెస్ అయితే అంగారకుడిపై మనుషులు నివసించేందుకు అవకాశం ఉందా? అక్కడ నీరు ఉన్నమాట వాస్తవమేనా తదితర విషయాలపై మరింత క్లారిటీ రానున్నది.