Begin typing your search above and press return to search.

నివాసానికి స్వర్గమైన ప్రపంచంలోనే టాప్ -10 నగరాలేవో తెలుసా?

By:  Tupaki Desk   |   24 Jun 2022 5:35 AM GMT
నివాసానికి స్వర్గమైన ప్రపంచంలోనే టాప్ -10 నగరాలేవో తెలుసా?
X
మనిషికి కావాల్సింది కూడు, గూడు, గుడ్డ.. ఈ మూడింటికోసమే ఏ మనిషి అయినా కష్టపడేది. వాటి కోసమే జీవించేది. ప్రస్తుతం ప్రపంచం యుద్దాలతో ఉగ్రవాదంతో సతమతమవుతోంది. చైనా, రష్యా లాంటి దేశాల పక్క దేశాలపై కయ్యానికి కాలుదువ్వి అక్కడి ప్రజల జీవన విధానాలను నాశనం చేస్తున్నాయి. ఒకప్పుడు ఎంతో సుందరంగా.. షూటింగ్ లకు స్పాట్ గా 'ఉక్రెయిన్’ ఉండేది. మన 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్ కూడా అక్కడే జరిగింది. కానీ ఇప్పుడా దేశంపైకి దండెత్తి నామరూపాల్లేకుండా చేసింది రష్యా. ఎంతో సంతోషంగా జీవించే ఉక్రెయిన్ ప్రజలను చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా విదేశాలకు వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

యుద్ధాలు లేని.. అత్యంత పటిస్ట రక్షణ వ్యవస్థలు, మౌళిక సదుపాయాలు గల ప్రపంచంలోనే టాప్ 10 నివాసయోగ్య దేశాల జాబితా తాజాగా రిలీజ్ అయ్యింది. 'ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్' నివేదిక విడులైంది. ఈ నివేదికలో యూరప్ లోని ఆస్ట్రియా రాజధాని 'వియన్నా’ ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా మొదటి స్థానాన్ని సాధించింది. 99.1 శాతం మంది ప్రజలు ఇక్కడ చాలా సంతోషంగా ఉంటామని సర్వేలో తేల్చారు. ఎలాంటి సమస్యలు లేవన్నారు. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో 1757 మిలియన్ల జనాభా ఉంటుంది. కేవలం 414.65 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉండే ఈ నగరం ప్రశాంతతకు మారుపేరు. మంచి పోలీసింగ్ వ్యవస్థ, రక్షణ, మౌళిక వసతులు, శుచి శుభ్రత.. ప్రపంచంలోనే నివాసయోగ్యంలో నంబర్ 1గా ఉంటుంది. యూరప్ దేశాల్లోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఆస్ట్రియా 7వ స్థానంలో ఉంటుంది.

అందరూ యూరప్ లో అగ్రరాజ్యాలు అని అనుకుంటున్న బ్రిటన్ రాజధాని లండన్, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లు ఈ జాబితాలో టాప్ 10లో లేకపోవడం గమనార్హం. పారిస్ 19వ స్థానంలో, లండన్ 33 వస్థానంలో నిలిచి నివాసయోగ్యంలో ర్యాంకులు దిగజార్చుకున్నాయి.

ప్రపంచంలోనే నివాసయోగ్య టాప్ 10 జాబితాలో వియన్నా తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత రెండో స్థానంలో డెన్మార్క్ రాజధాని 'కోపెన్ హగెన్’ నిలిచింది. ఇక్కడి ప్రజలు 98శాతం సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇక మూడో స్థానంలో స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్, 4వ స్థానంలో కెనడాలోని 'కాల్ గరీ’, 5వ స్థానంలో 'వాంకోవర్’, స్విట్జర్లాండ్ లోని 'జెనెవా’6వ స్థానంలో నిలిచింది.

ఇక 7వ స్థానంలో జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్, 8వ స్థానంలో టొరంటో, 9వ స్తానంలో నెదర్లాండ్స్ రాజధాని 'అమస్టర్ డమ్’, 10వ స్థానంలో జపాన్ లోని 'ఒసాకా’, 11వ స్థానంలో ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ నగరాలు నిలిచాయి.

ప్రపంచంలోనే ప్రశాంతతకు మారుపేరుగా నివాసయోగ్యంగా.. అత్యంత మౌళిక వసతులు కలిగిన నగరాల్లో ఏకంగా కెనడా దేశంలోనూ మూడు నగరాలు ఉండడం విశేషంగా చెప్పొచ్చు. ఆ తర్వాత స్విట్జర్లాండ్ లోని 2 నగరాలున్నాయి.