Begin typing your search above and press return to search.

అధికంగా టీవీ చూస్తున్నారా..? ‌పొంచి ఉంది ప్ర‌మాదం

By:  Tupaki Desk   |   8 July 2020 8:00 AM IST
అధికంగా టీవీ చూస్తున్నారా..? ‌పొంచి ఉంది ప్ర‌మాదం
X
ప్ర‌స్తుతం వైర‌స్ ప్ర‌భావంతో ఇంట్లో కుటుంబ‌స‌భ్యులంతా ఒక‌చోట ఉంటున్నారు. చిన్న ప‌ని ఉన్నా బ‌య‌ట‌కు వెళ్లేందుకు సాహ‌సించ‌డం లేదు. అన్ని ప‌నులు ఒకేసారి పూర్త‌య్యేలా ప్లాన్ చేసుకుని మ‌రి బ‌య‌ట‌కు వెళ్లి మ‌ళ్లీ వెంట‌నే ఇంటికి వ‌స్తున్నారు. దీనివ‌ల‌న ఒక కుటుంబం.. కుటుంబం మాదిరి ఉంటున్న ప‌రిస్థితులు. అయితే ఇంట్లో ఉన్న వారంతా టీవీలు చూస్తూ కూర్చుంటున్నారు. యువ‌త కూడా టీవీల‌కు అతుక్కు‌పోయిన ప‌రిస్థితి. లాక్ డౌన్ ఎ‌ఫెక్ట్‌తో అందరూ ఇంటికి పరిమితమయ్యారు. ఏం చేయాలో తెలియక ఇంటర్నెట్‌లో వీడియోలు, టీవీలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు.

అయితే టీవీ చూడ‌డం ప్ర‌మాద‌క‌రంగా మారింది. టైమ్‌పాస్ కోసం కొద్దిసేపు చూస్తే ఏమీ కాదు. కానీ గంట‌ల చొప్పున అదే ప‌నిగా టీవీ చూస్తే ఆరోగ్యానికి తీవ్ర ప్ర‌మాదం అని ప‌రిశోధ‌కులు, శాస్త్ర‌వేత్త‌లు హెచ్చరిస్తున్నారు. కొందరు మాత్రం అదే పనిగా టీవీ చూస్తుంటారు. వారిపై కొంద‌రు శాస్త్ర‌వేత్త‌లు, ప‌రిశోధ‌కులు ప‌రీక్ష‌లు చేశారు. వారిపై ఓ నివేదిక రూపొందించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను తెలిపారు. వివిధ రకాల సమస్యలు, కోరికలు ఉండి అవి తీరకపోతే ఆ అసంతృప్తితో ఉన్నవారే ఎక్కువ గా టీవీ చూస్తుంటారని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ విష‌యాల‌ను మేరీ ల్యాండ్ విశ్వ‌విద్యాల‌యం ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

విశ్వ‌విద్యాల‌య అధ్య‌య‌న బృందం ఏకంగా 40 వేల మందిపై అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో ఆసక్తి క‌లిపే విషయాలను బయటపెట్టింది. వివిధ రకాల సమస్యలు, కోరికలు ఉన్న వారు అవి తీరక అసంతృప్తితో ఉంటే దాంతోనే టీవీ చూస్తుంటారని వారి అధ్య‌య‌నంలో తేలింది. ఆనందంగా ఉండేవారు త‌క్కువ సేపు టీవీ చూస్తార‌ని స‌ర్వే తెలిపింది. అసంతృప్తి పరులు 30 శాతం ఎక్కువ గా రకరకాల ప్రోగ్రామ్స్ చూసేందుకు ఆసక్తి చూపిస్తారని అధ్య‌య‌నం చెబుతోంది. టీవీ చూస్తే త‌మ‌ సమస్య తగ్గుతుందనే భావ‌న‌ తో చాలా మంది టీవీ ముందు కూర్చుంటార‌ని పేర్కొంది. టీవీ చూడడం తో తాత్కాలికంగా మనసుకు ఊరట గా అనిపించినా ముందు ముందు తీవ్ర నిరాశ కు గురవుతారని ఆ నివేదిక హెచ్చ‌రిస్తోంది. మ‌న‌సు బాలేన‌ప్పుడు.. స‌మ‌స్య‌ల్లో ఉన్న‌ప్పుడు టీవీ కాకుండా పుస్త‌కాలు చ‌ద‌వాలని, కుటుంబ‌ స‌భ్యులు.. స్నేహితుల తో కాలక్షేపం చేయాల‌ని విశ్వ‌ విద్యాల‌య బృందం సూచిస్తోంది.