Begin typing your search above and press return to search.

'మందేస్తే' ఇమ్యూనిటీ పెరుగుతుందా? నిజమెంత?

By:  Tupaki Desk   |   31 Oct 2020 11:15 AM IST
మందేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుందా? నిజమెంత?
X
కరోనాను జయించాలంటే రోగనిరోధక శక్తని పెంచుకోవడం ఒక్కటే మార్గం. దీంతో ఇటీవల ఇమ్యూనిటీ పెంచే ఆహారపదార్థాలు ఇవే.. అంటూ సోషల్​మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చాలా మంది ఫేస్​బుక్​, వాట్సాప్​లో ఇటువంటి వార్తలను షేర్​ చేస్తున్నారు. రీసెంట్​గా ఓ వార్త వైరల్​ అవుతోంది. రోజూ రెండు పెగ్గులు మద్యం సేవిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందని... గొంతులో ఉన్న కరోనా వైరస్​ చనిపోతుందన్న వార్త ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్​ గా మారింది.దీంతో చాలా మంది ఈ విషయాన్ని నమ్మి మద్యం తాగుతున్నారు. అలవాటు లేనివాళ్లు కళ్లు మూసుకొని రెండు గ్లాసులు మింగుతున్నారు.

అయితే ఇందులో వాస్తవమెంత.. దీనిపై వైద్యనిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.. ‘మద్యం తాగితే రోగనిరోధక శక్తి పెరగకపోగా తగ్గుతుంది. ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపుతుంది. లివర్​ దెబ్బతినే అవకాశం ఉంది. మద్యం సేవిస్తే గొంతులో ఉన్న కరోనా వైరస్​ చనిపోతుందని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలు లేవు. అంతేకాక మనం గొంతులో కొన్ని సహజకణాలు ఉంటాయి. ఇవి హానికరమైన వైరస్​లను ఊపిరితిత్తుల్లోకి చేరకుండా అడ్డుకుంటాయి. ఇటువంటి కణాలను మద్యం చంపుతుంది. మద్యం సేవిస్తే నష్టమే తప్ప లాభం లేదు’ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోషల్​ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలు నమ్మి మద్యం సేవిస్తే నష్ట పోయేది మనమేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.