Begin typing your search above and press return to search.
రూపాయి కంటే తక్కువగా కిలో టమోటా
By: Tupaki Desk | 9 Sept 2015 4:43 AM ISTటమోటా రేటు దారుణంగా పడిపోయింది. బహిరంగ మార్కెట్లో కిలో పాతిక వరకు ఉన్న టమోటా.. రైతులకు మాత్రం కన్నీటినే మిగిలుస్తోంది. ఇటీవల కురిసన వర్షాల కారణంగా టమోటా నాణ్యత దెబ్బ తిందన్న పేరుతో వ్యాపారులు.. చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్ లో కనీస ధర సంగతి తర్వాత.. కిలో రూపాయి కూడా పలకని దుస్థితి.
రెండు రోజుల క్రితం వరకూ కిలో టమోటా రూ.10 తగ్గకుండా ఉన్నా.. తాజాగా నాణ్యత లేదని చెబుతూ.. కిలో 80పైసలకు కొనేందుకు కూడా వ్యాపారులు ముందుకు రాకపోవటంతో రైతులు బోరుమంటున్నారు. తాజా పరిణామంతో మదనపల్లి మార్కెట్ కు తెచ్చిన సరుకుతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు.. గత రెండు రోజులుగా వందలాది టన్నుల (ఒక టన్ను అంటే వెయ్యి కిలోలు) సరుకు మార్కెట్ లోకి రావటం.. సరుకును కొనేందుకు హోల్‌సేల్ వ్యాపారులు ముందుకు రాకపోవటంతో రైతులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. బహిరంగ మార్కెట్ లో రూ.25 పలుకుతున్న కిలో టమోటా.. రైతు దగ్గర కొనే సమయంలో మాత్రం 80 పైసలు కూడా పలకకపోవటం గమనార్హం.