Begin typing your search above and press return to search.

క‌ల‌బంద ర‌సంతో ఎంత క‌వ‌ర్ చేయొచ్చు?

By:  Tupaki Desk   |   26 July 2017 5:25 AM GMT
క‌ల‌బంద ర‌సంతో ఎంత క‌వ‌ర్ చేయొచ్చు?
X
డ్ర‌గ్స్ విచార‌ణ‌కు సంబంధించి ఒక‌ సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట‌కు రావ‌టం తెలిసిందే. విచార‌ణ‌కు వ‌స్తున్న ప్ర‌ముఖులు ప‌లువురు ఉత్సాహంతో రావ‌టం.. తాము సుద్ద‌పూస‌ల‌మ‌న్న‌ట్లుగా మాట్లాడ‌టం తెలిసిందే. అయితే.. వారి కాన్ఫిడెన్స్ వెనుకున్న అస‌లు విష‌యాన్ని సిట్ చీఫ్ అకున్ స‌బ‌ర్వాల్ త‌న‌దైన శైలిలో బ‌య‌ట పెట్టేయ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

డ్ర‌గ్స్ కార‌ణంగా ఒంట్లో ఉన్న వాటి మూలాల్ని క‌నిపించ‌కుండా ఉండేందుకు.. డ్ర‌గ్స్ ఆన‌వాళ్ల‌ను క‌వ‌ర్ చేయ‌టానికి క‌ల‌బంద ర‌సాన్ని తాగి విచార‌ణ‌కు వ‌స్తున్నార‌న్న విష‌యాన్ని స‌బ‌ర్వాల్ వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో క‌ల‌బంద ర‌సం తాగి రావ‌టం ద్వారా డ్ర‌గ్స్ వాడ‌కాన్ని క‌వ‌ర్ చేసే వీలు ఉందా? అన్న‌ది ప్ర‌ధాన ప్ర‌శ్న‌గా మారింది.

మ‌రి.. దీనిపై శాస్త్రీయ వాద‌న‌లు చూస్తే.. ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. క‌ల‌బంద ర‌సం తాగి రావ‌టం ద్వారా ఒంట్లో ఉన్న‌ డ్ర‌గ్స్ మూలాలు క‌నిపించ‌కుండా చేయొచ్చా? అన్న ప్ర‌శ్న‌కు నిపుణుల వాద‌న‌లు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయ‌ని చెప్పొచ్చు. దీనికి సంబంధించి చెబుతున్న కొన్ని వాద‌న‌ల్ని చూస్తే..

= శ‌రీరంలో విష‌తుల్యాలు తొల‌గించి.. జీవ క్రియ‌ల్ని పున‌ర్నిర్మించ‌టంలో క‌ల‌బందం దివ్య ఔష‌ధంగా ప‌ని చేస్తుంది. సాధార‌ణంగా శ‌రీరంలో ఏ రూపంలో అయినా.. ఏ ర‌క‌మైన ఔష‌ధాన్ని పెద్ద మొత్తంలో తీసుకున్నా.. వాటి విష‌తుల్యాలు శ‌రీరంలో అలా పేరుకు పోతాయి. దీంతో శ‌రీర జీవ‌క్రియ‌లు దెబ్బ తింటాయి. అలాంటి వాటిని క‌ల‌బంద మెరుగుప‌ర్చ‌టంతో పాటు.. విష‌తుల్యాల్ని క‌వ‌ర్ చేస్తాయి.

= జ‌బ్బుల్ని త‌గ్గించ‌టానికి వాడిన వివిధ డ్ర‌గ్స్ మూలాలు శ‌రీరంలో పేరుకుపోతాయి. వాటి చెడు ప్ర‌భావం నుంచి బ‌య‌ట‌ప‌డేయ‌టానికి క‌ల‌బంద ఉత్ప‌త్తుల్ని మంచి ప్ర‌భావాన్ని చూపిస్తాయ‌ని అయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

= వైద్యులు.. నిపుణుల మాట‌కు భిన్న‌మైన వాద‌న‌ను ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు. విష‌తుల్యాల్ని బ‌య‌ట‌కు పంపించే దివ్య ఔష‌ధంగా ప‌ని చేసే క‌ల‌బంద మాట నిజ‌మే అయినా.. అదంతా కూడా స‌ద‌రు వ్య‌క్తి ఒక వారంపాటో.. ఒక రోజు వ్య‌వ‌ధిలో తీసుకున్న దానిని మాత్ర‌మే బ‌య‌ట ప‌డేస్తుంద‌ని చెబుతున్నారు. అంతేకానీ.. కొంత‌కాలంగా డ్ర‌గ్స్ వాడుతున్న వారు.. క‌ల‌బంద ర‌సాన్ని వాడినంత మాత్రాన వారి ఒంట్లో ఉన్న విష‌తుల్యాలు (డ్ర‌గ్స్ మూలాలు) తొలిగిపోయే అవ‌కాశం లేద‌ని చెబుతున్నారు. క‌ల‌బంద ప్ర‌భావం పూర్తిగా ఉండ‌ద‌ని తాము చెప్ప‌టం లేద‌ని.. కొంత మేర మాత్ర‌మే దానితో ప్ర‌యోజ‌నం ఉంటుంద‌న్న వాద‌న‌ను వినిపిస్తున్నారు.