Begin typing your search above and press return to search.

గోవా స్థిరాస్తి రంగంలో టాలీవుడ్ జంట పెట్టుబ‌డులు?

By:  Tupaki Desk   |   23 Aug 2021 4:30 PM GMT
గోవా స్థిరాస్తి రంగంలో టాలీవుడ్ జంట పెట్టుబ‌డులు?
X
గోవా బీచ్ ప‌ర్యాట‌కానికి ప్ర‌సిద్ధి. సినీటూరిజానికి ఈ చోటు ఎంతో అనుకూల‌మైన‌ది. టాలీవుడ్ ద‌ర్శ‌కుల్లో పూరి జ‌గ‌న్నాథ్ త‌న సినిమాల షూటింగుల్ని పాట‌ల చిత్రీక‌ర‌ణ‌ల్ని గోవాలో ప్లాన్ చేసేందుకు ఎక్కువ ఆస‌క్తిగా ఉంటారు. ఇక గోవాలో సొంతంగా విల్లాలు క‌లిగి ఉన్న స్టార్ల‌కు కొద‌వేమీ లేదు. కిలాడీ అక్ష‌య్ కుమార్.. మ‌లైకా అరోరాఖాన్ - అమృత అరోరా.. ప్రియాంక చోప్రా.. త‌దిత‌రులు సొంతంగా విల్లాల్ని క‌లిగి ఉన్నారు.

ఇప్పుడు అలాంటి ఫేజ్ 3 వ‌ర‌ల్డ్ లో అక్కినేని కోడ‌లు స‌మంత త‌న హ‌బ్బీ నాగ‌చైత‌న్య‌తో క‌లిసి ఓ విల్లాను కొనుక్కునేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. ఎందుకంటే ప్ర‌తిసారీ గోవా సెల‌బ్రేష‌న్స్ కి వెళ్లిన‌ప్పుడు అక్కడ ఆస్వాధ‌న‌ల‌కు ప్ర‌యివేటు అతిథి గృహాల‌ను ఆశ్ర‌యించాల్సి వ‌స్తోంది. సెలవులో వారి మధ్య రొమాంటిక్ డేస్ ని ఆస్వాధించేందుకు ఇవి అనుకూలం కాద‌ని భావిస్తున్నార‌ట‌. ఇటీవ‌ల ఈ జంట‌కు గోవా రెండో ఇల్లుగా మారింది. అందుకే అక్కడ సొంతంగా ఓ అపార్ట్‌మెంట్ కొనుక్కోవాల‌ని వెతుకుతున్నారని తెలిసింది. ఈ ఆద‌ర్శ జంట సీ-ఫేసింగ్ ఉన్న విల్లాను కొనడానికి ఆసక్తిగా ఉన్నార‌ని తెలుస్తోంది. అంతేకాదు గోవా లాంటి చోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కూడా మరికొన్ని ప్ర‌ణాళిక‌లు ఉన్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఒక వ్యాపార ప్రతిపాదన అక్కడికి వచ్చిందని తెలిసింది. దీని ప్ర‌కారం.. గోవా ప‌రిస‌రాల్లోని కొన్ని పాత విల్లాలను కొనుగోలు చేస్తారు. వాటిని రీ మోడలింగ్ చేసి కొత్త‌గా మార్చి సౌక‌ర్యాల‌ను పునరుద్ధరించి ఆపై వాటిని ఇతర పార్టీలకు విక్రయిస్తారట‌. టాలీవుడ్‌లో చైత‌న్య - స‌మంత జంట‌కు మంచి నెట్‌వర్క్ ఉన్నందున ఇక్కడ చాలా మంది ప్రముఖులు విల్లాలు కొనుక్కునేందుకు ఆస్కారం లేక‌పోలేద‌ని అంచ‌నా.

ఇది నిజ‌మా కాదా అన్న‌దానిపై ఎలాంటి అధికారిక క‌న్ఫ‌ర్మేష‌న్ లేదు. కానీ వారు గోవా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టబోతున్నారనే గుస‌గుస‌లు వేగంగా వైర‌ల్ అవుతున్నాయి. త్వరలో దక్షిణ గోవాలో తమ లగ్జరీ ప్యాడ్ ను కొనుగోలు చేయ‌నున్నార‌ని కూడా టాక్ వేగంగా వైర‌ల్ అవుతోంది.

చైత‌న్య‌- స‌మంత ఇద్ద‌రి కెరీర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. ఫ్యామిలీ మ్యాన్ 2 సీజ‌న్ లో స‌మంత పాత్ర‌కు గొప్ప ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అనంత‌రం నెట్ ఫ్లిక్స్ సిరీస్ కోసం సంత‌కం చేశార‌ని భారీ పారితోషికం అందుకుంటున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇటీవ‌ల సామ్ -చై వార్షికాదాయం కూడా భారీగా పెరిగింద‌ని ఆ ఆదాయాన్ని అలా రియ‌ల్ ఎస్టేట్ వైపు పెట్టుబ‌డులుగా మారుస్తున్నార‌ని కూడా ప్ర‌చార‌మ‌వుతోంది.

అక్కినేని కోడ‌లు స‌మంత ఇటీవ‌లే శాకుంత‌లం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసారు. అనంత‌రం పాండిచ్చేరిలో త‌మిళ సినిమా షూటింగులో చేరారు. నయనతార- విజయ్ సేతుపతితో క‌లిసి విఘ్నేష్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. నాగ‌చైత‌న్య ఇటీవ‌లే అమీర్ ఖాన్ `లాల్ సింగ్ చద్దా` చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసారు. విక్రమ్ కుమార్ థాంక్యూ లోనూ న‌టిస్తున్నారు. క‌మ్ముల‌తో ల‌వ్ స్టోరి సెప్టెంబ‌ర్ లో రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.