Begin typing your search above and press return to search.
జగన్ కు జై కొట్టిన మరో సినీ నటుడు!
By: Tupaki Desk | 18 Sept 2018 6:11 PM ISTఏపీలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు అశేష ప్రజాదరణ లభిస్తోన్న సంగతి తెలిసిందే. జననేత జగన్ పర్యటించిన ప్రతి చోట జనం నీరాజనాలు పలుకుతున్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ సీఎం కావాలని వైసీపీనేతలు ఆకాంక్షిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు - అభిమానులతో పాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి కూడా చాలామంది జగన్ కు మద్దతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. పోసాని కృష్ణమురళి - కమెడియన్ పృథ్వీ రాజ్ లు పాదయాత్రలో ఉన్న జగన్ ను కలిసి తమ మద్దతు తెలిపారు. జగనే కాబోయే సీఎం అని థర్టీ ఈయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ పలుమార్లు ఘంటాపథంగా చెప్పారు. తాజాగా, మరో సినీ నటుడు జగన్ కు జై కొట్టాడు. టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్....జగన్ ను కలిసి తన సంఘీభావం తెలిపాడు.
ఏపీలో మరో 9 నెలల్లో సాధారణ ఎన్నికలు జరగబోతోన్న నేపథ్యంలో వైసీపీకి మద్దతు పెరుగుతూ పోతోంది. ఇప్పటికే పలురంగాలకు చెందిన వారు వైసీపీ అధినేత జగన్ కు జై కొట్టారు. టాలీవుడ్ నుంచి కమెడియన్లు పృథ్వీ - పోసాని జగన్ కు మద్దతు తెలిపారు. తాజాగా - సినీ నటుడు ఫిష్ వెంకట్.. జగన్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. విశాఖపట్నంలోని ఆనందపురం దగ్గర పాదయాత్ర చేస్తున్న జగన్ ను వెంకట్ కలిసి మద్దతు తెలిపారు. జననేత జగన్ అడుగులో అడుగు వేస్తూ ....కొంతదూరం నడిచారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీదే గెలుపని - జగన్ తప్పక సీఎం అవుతారని వెంకట్ ఆకాంక్షించారు.