Begin typing your search above and press return to search.
మేధావులకే ఇల్లు అద్దె.. ఐటీ సిటీ టూలెట్ బోర్డు కథ
By: Tupaki Desk | 29 April 2023 10:00 PM GMTఐటీ సిటీ బెంగళూరులో ఇప్పుడు యజమానులంతా అద్దెలతోనే బతికేస్తున్నారు. ఎందుకంటే దేశంలోనే సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన ఈ నగరంలో అద్దెకు ఇల్లు దొరకడం చాలా కష్టం.. గగనం కూడా. అందుకే ఒక్క ఇల్లు ఉంటే చాలు ఆ నెల అంతా గడిపేయవచ్చు. బెంగళూరులో టెక్కీలకు ఒక్క మంచి ఇల్లు కావాలంటే దొరకడం గమనం. అలాగే వాటి రేట్లు కూడా వాచిపోతాయి. ఇక సింగిల్స్, పెళ్లికాని వారికి అద్దెకు ఇవ్వడానికి చాలా కండీషన్లు అప్లై చేస్తుంటారు. ఇంకొందరేమో తమ కులం వాళ్లకు, వెజిటేరియన్స్ కు మాత్రమే ఇచ్చే సామాజికవర్గాల వారు ఉంటారు.
తాజాగా ఓ వ్యక్తి బెంగళూరులో టూలెట్ పెట్టాడు. అది అందరినీ ఆశ్చర్యపరిచింది. షాకిచ్చేలా చేసింది. 'శుభ్' అనే వ్యక్తి ట్వీట్ తో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తన కజిన్ కి ఇంటర్ లో వచ్చిన మార్కుల వల్ల ఇల్లు అద్దెకు దొరకలేదని ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. అది చూసి అందరూ ముక్కున వేలేసుకున్నాడు.
ఇంటర్ లో అతడికి 76 శాతం మార్కులు వచ్చాయట.. కానీ డిస్టింక్షన్ లో ఇంటర్ పాస్ అయిన వారికే తాను ఇల్లు అద్దెకు ఇస్తానని యజమాని పేర్కొన్నాడు. 90 శాతం మార్కులు వచ్చిన వారికే ఇల్లు అద్దెకు ఇస్తానని చెప్పి, తన కజిన్ ను బయటకు పంపించేశాడంటూ ట్వీట్ చేశాడు శుభ్. అంటే మేధావులకే ఆ ఇంటి యజమాని ఇల్లు అద్దుకు ఇస్తాడన్న మాట..
బెంగళూరులో మామూలుగానే ఇల్లు అద్దెకు దొరకడం కష్టం. ఒకవేళ దొరికినా 10 నెలల అద్దె అడ్వాన్స్ గా కట్టాలి. బెంగళూరులో ఇంటి అద్దెలు కట్టడం కంటే నగరానికి దూరంగా ఓ సొంత ఇల్లు కొనుక్కొని ఈఎంఐ కట్టుకోవడం బెటర్ అని చాలా మంది భావిస్తారు. అలానే చేస్తారు కూడా.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఇదే పనిచేస్తుంటారు.
బెంగలూరులో అద్దెలు వాచిపోవడానికి కారణం లక్షల జీతం సంపాదించే సాఫ్ట్ వేర్ ఇంజినర్లు ఉండడమే. ఇక్కడ ఐటీ సిటీ కావడంతో వేల మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పనిచేస్తుంటారు. దీంతో వారి హోదాకు అనుగుణంగా అద్దెలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆ మధ్య కరోనా టైంలో ఉద్యోగులంతా ఇళ్లకు వెళితే లక్షల అద్దెలను యజమానులు కోల్పోయారు. ఇప్పుడు వర్క్ ఫ్రం హోం ఎత్తివేయడంతో మళ్లీ బెంగలూరులో అద్దెల పోటీ.. డిమాండ్ల చిట్టాను బయటపెడుతున్నారు యజమానులు.
మరీ ఇలా మార్కుల చిట్టా తీసి మేధావులకే అద్దెకు ఇల్లు ఇస్తానన్న వ్యవహారం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. మార్కుల ఆధారంగా ఇల్లను అద్దెకు ఇవ్వడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఈ ట్వీట్ పై ఇప్పుడు అందరూ ఫన్నీగా సమాధానం ఇస్తున్నారు. మామూలు వ్యక్తులకు బెంగళూరులో ఇల్లు అద్దెకు దొరకడం కానకష్టమే అని అందరూ నిట్టూరుస్తున్నారు.