Begin typing your search above and press return to search.
ఇలానే కొనసాగితే.. వచ్చే ఏడాది మెగా ఈవెంట్ ఉండదట!
By: Tupaki Desk | 24 July 2020 5:00 AM ISTక్రీడా ప్రియులకు 2020 మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. ఊహకు కూడా అందని రీతిలో క్రీడలకు చెక్ చెప్పిన కరోనా దెబ్బకు ప్రపంచ క్రీడా సంరంభంగా చెప్పే ఒలింపిక్స్ సైతం వచ్చే ఏడాదికి వాయిదా పడటం తెలిసిందే. అన్ని బాగుంటే.. ఇదే రోజున (జులై 23)న జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్ కు జేగంట మోగాల్సి ఉంది. కరోనాకారణంగా ఈ మెగా ఈవెంట్ ను వచ్చే ఏడాదికి వాయిదా వేశారు.
ఈ పరిస్థితుల్లో టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ చీఫ్ యొషిరో మోరీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనో కీలక వ్యాఖ్య చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితి కానీ కొనసాగితే.. వచ్చే ఏడాదికి వాయిదా పడిన ఒలింపిక్స్ క్రీడలు జరిగే అవకాశం లేదన్నారు. వ్యాక్సిన్ వస్తే పరిస్థితి మారుతుందని.. లేదంటే.. ఇలాంటి పరిస్థితులే ఉంటే ఆటలు ఎలా సాగుతాయి చెప్పండి? అని ఆయన ప్రశ్నించారు.
అందరూ కలిసి కరోనాను తరిమేస్తే.. ఒలింపిక్స్ కచ్ఛితంగా జరుగుతాయన్నారు. ఈ రోజు (జులై 23) జరగాల్సిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్ని సరిగ్గా వచ్చే ఏడాది ఇదే రోజుకు వాయిదా వేశారు. ఈ రీషెడ్యూల్ కు గుర్తుగా టోక్యోలోని ప్రధాన స్టేడియంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే..దీనికి కేవలం పదుల సంఖ్యలో మాత్రమే హాజరు కానున్నారు. మరో విషయం ఏమంటే.. విశ్వక్రీడలుగా అభివర్ణించే ఒలింపిక్స్ ఈవెంట్ వచ్చే ఏడాది కానీ జరగకుంటే.. రద్దు చేస్తారు. తదుపరి ఒలింపిక్స్ మాత్రమే జరుపుతారు. విశ్వక్రీడలు జరగాలంటే కరోనాను తరిమియేటం మినహా మరో మార్గం లేనట్లే.