Begin typing your search above and press return to search.
భర్త రాసలీలల్ని గొప్పగా చెప్పే పెళ్లాం స్టోరీ
By: Tupaki Desk | 27 April 2017 5:43 AM GMTఎంత విశాలమైన మనసున్న పెళ్లాం అయినా. . తన భర్తకు తనతో కాకుండా మరికొందరితో సంబంధాలు ఉన్నాయంటే విని తట్టుకోలేదు. భార్య విషయంలోనే కాదు.. భర్తలదీ అదే పరిస్థితి. దీనికి భిన్నమైనది ఇప్పుడు చెప్పే స్టోరీ. రోజుకు కనీసం నలుగురు భామలతో పడక పంచుకోనిది పొద్దుపొచ్చని విలాసవంతమైన సంపన్నుడైన భర్త గురించి గొప్పలు చెప్పుకునే భార్య కథ. వినేందుకు విచిత్రంగా ఉన్నా నిజం. ఇలాంటి చిత్రమైన మెగుడూ.. పెళ్లాల ముచ్చట గురించి తెలియాలంటే ఆస్ట్రేలియా వరకూ వెళ్లారు.
44 ఏళ్ల వ్యాపారవేత్త ట్రేవర్స్ బేనన్ బాగా బలిసినోడు. అయ్యగారికి సంపదకు సంబంధించి ఎలాంటి సమస్యలూ లేవు. అయ్యగారికి డబ్బు సంపాదనతో పాటు..అమ్మాయిల పిచ్చి ఓ రేంజ్లో ఉంటుంది. తనను తాను కింగ్ ఆఫ్ ఇన్ స్టాగ్రామ్ గా చెప్పేసుకుంటుంటాడు. తొలి పెళ్లిని 1991లో చేసుకున్నాడు. మొదటి భార్య పేరు నినిబెత్ బిట్రీజ్ జిమినెజ్ లీయల్. పేరు పలకటానికి కష్టంగా ఉన్నా.. ఆమె గురించి.. ఆమె అందం గొప్పతనం గురించి సింఫుల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆమె 1991లోప్రపంచ సుందరి టైటిల్ ను సొంతం చేసుకున్న సుందరాంగి. చక్కటి చుక్కలాంటి పెళ్లాం ఉన్నా.. పరాయి మహిళల మీద మోజు ఎక్కువే. ఈ గోలను భరించలేకపోయిందేమో కానీ.. బేనన్ తో తనకున్న పదిహేడేళ్ల వైవాహిక బంధాన్ని తెంచేసుకొంది లీయల్.
తర్వాతి కాస్త గ్యాప్ ఇచ్చిన బేనన్.. తనతో సంబంధాలున్న మహిళల్లో ఒకరైన తాయేశాను రెండో పెళ్లి చేసుకున్నాడు. తాజాగా ఆమెఒక మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడీ ఇంటర్వ్యూ అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. తన భర్తకున్న అమ్మాయిల పిచ్చిని.. గొప్పగా చెప్పేసుకోవటమే దీనికి కారణం. తన భర్తకు ఎంతమంది మహిళలతో సంబంధాలున్నా.. భార్యను మాత్రం తానొక్కదాన్నేనన్న సంబరం విన్న వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. తమ పెళ్లికి తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదని.. బేనన్ తన జీవితాన్ని నాశనం చేస్తాడని తన తల్లిదండ్రులు భావించేవారని.. కానీ.. అతడితో తన పెళ్లి జరిగి.. బాగానే ఉన్నామని చెప్పుకొచ్చింది. విపరీత పోకడలతో భర్త ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా వెనకేసుకొస్తున్న తాయేశా లాంటి భార్య దొరికితే బేనన్ లాంటోడికి కావాల్సిందేముంది?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/