Begin typing your search above and press return to search.

అమెరికా - చెన్నైకు అరుదైన ఎయిర్ లిఫ్టు ఆపరేషన్.. ఖర్చు ఎంతంటే?

By:  Tupaki Desk   |   21 July 2022 11:09 AM IST
అమెరికా - చెన్నైకు అరుదైన ఎయిర్ లిఫ్టు ఆపరేషన్.. ఖర్చు ఎంతంటే?
X
ఒక పెద్ద వయస్కురాలిని కాపాడేందుకు అరుదైన ప్రయత్నం జరిగింది. ఇందుకోసం భారీగా ఖర్చు అయినప్పటికీ.. అత్యవసర వైద్యం కోసం జరిగిన ఈ ప్రయత్నం పలువురిని ఆకర్షిస్తోంది. బెంగళూరుకు చెందిన ఒక పెద్ద వయస్కురాలికి తీవ్ర అనారోగ్యంతో అమెరికాలో ఉన్నారు.

దీంతో ఆమెను చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి చేర్చేందుకు భారీ అపరేషన్ ఒకటి జరిగింది. ఇందుకోసం దాదాపు రూ.కోటి ఖర్చును లెక్క చేయకుండా అమెరికా నుంచి చెన్నైకుతీసుకొచ్చారు.

అమెరికాలోని ఒరేగాన్ స్టేట్ లోని పోర్ట్ ల్యాండ్ లో ఉన్న 67ఏళ్ల పెద్ద వయస్కురాలికి తీవ్రమైన ఆరోగ్య సమస్యతోఉన్నారు. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించటంతో పాటు.. ఇతర అవయువాలు సైతం దెబ్బ తింటున్న వైనాన్ని గుర్తించారు. దీంతో ఆమెకు డయాలసిస్ మొదలు పెట్టారు.

అమెరికాలో వైద్య ఖర్చులు భారీగా ఉండటంతో చెన్నైకి షిప్టు చేసేందుకు డిసైడ్ అయ్యారు. పలు ధఫాలు చర్చల అనంతరం అమెరికా నుంచి బాధితురాలిని ఎయిర్ అంబులెన్సులో చెన్నైకి తరలించేందుకు బెంగళూరు కేంద్రంగా ఉండే ఇంటర్నేషనల్ క్రిటికల్ కేర్ ఎయిరర్ ట్రాన్సఫర్ టీం సదరు బాధ్యతను చేపట్టింది. ఇందులో భాగంగా పేషెంట్ కు అవసరమైన డయాలసిస్ ను.. క్రిటికల్ కేర్ కు సంబంధించిన ఏర్పాట్లను సైతం విమానంలోనే ఏర్పాటు చేశారు.

జులై 17న మొదలైన ఈ ఎయిర్ లిఫ్టింగ్ 23 గంటల పాటుసుదీర్ఘంగా సాగింది. మధ్యలో ఇస్తాంబుల్ లో ఒకసారి మాత్రమే విమానం ల్యాండ్ అయ్యింది. ఆ సందర్భంగా విమాన సిబ్బందిని మార్చేందుకుఆపారు. అనంతరం చెన్నై ఆసుపత్రికి సదరు పెద్ద వయస్కురాలిని తీసుకొచ్చి చికిత్స చేపట్టారు. ఇందుకోసం రూ.కోటి వరకు ఖర్చు అయినట్లుగా వెల్లడించారు. ఇలాంటి ఎయిర్ లిఫ్టులు చాలా చాలా అరుదుగా జరుగుతాయని చెబుతున్నారు.

లాక్ డౌన్ వేళలో అఫ్ఘనిస్తాన్ కు చెందిన రోగిని హైదరాబాద్ కు తరలించారు. గడిచిన 18 నెలల్లో 500 మంది వరకు కొవిడ్ బాధితులను ఎయిర్ లిఫ్టు ద్వారా వారు ఎంచుకున్న గమ్యస్థానాలకు చేర్చినట్లుగా ఐసీఏటీటీ పేర్కొంది. ఈ అన్ని ఎయిర్ లిఫ్టుల్లో అమెరికా నుంచి చెన్నైకు 23 గంటల నాన్ స్టాప్ జర్నీ అరుదైన రికార్డుగా చెబుతున్నారు