Begin typing your search above and press return to search.
గిఫ్ట్ చూసి అదిరి పోయిన పెళ్లికొడుకు.. !
By: Tupaki Desk | 29 Nov 2020 9:00 AM ISTపెళ్లిళ్లలో గిఫ్ట్‌లు ఇవ్వడం ఎంతో కామన్. అయితే కొంతమంది ప్రత్యేకతను చాటుకొనేందుకు వెరైటీ గిఫ్ట్‌లు ఇస్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం ఓ మహిళ ఎవరూ ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. పెళ్లి కొడుకుకు ఓ రివాల్వర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. అది దీపావళి బొమ్మ తుపాకీ అనుకున్నారంతా.. కానీ పట్టుకొని చూస్తే అది నిజంగానే రివాల్వర్. అది కూడా ఏకే 47. గిఫ్ట్‌ను చూసిన పెళ్లికొడుకు షాక్ అయ్యాడు. ఈ రివాల్వర్‌తో ఎవరిని కాల్చమంటారు? అన్నట్టుగా అనుమానంగా చూశాడు.
అయితే చివరకు అదే రివాల్వర్‌తో ఓ ఫొటోకు ఫోజు ఇచ్చాడు. ఆఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పాకిస్థాన్‌లో జరిగిందీ ఘటన. అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పాకిస్థాన్‌లో‘కలాష్నికోవ్’ అనే సాంప్రదాయం ఉంది. ఈ ఆచారం ప్రకారం అత్తగారు.. కొత్త అల్లుడిగి ఏదో ఒక మారణాయుధం గిఫ్ట్‌గా ఇవ్వాలట. అందులో భాగంగానే ఈ గిఫ్ట్ ఇచ్చిఉంటారని సమాచారం.
ఏం మర్యాదో ఏమో… ఇలా మారణాయుధాలను బహుమతిగా ఇస్తారా అంటూ నెటిజన్లు విస్తుపోతున్నారు.
‘మారణాయుధాలను గిఫ్ట్‌లుగా ఇచ్చి ఈ సభ్యసమాజానికి ఏం మెసెజ్ ఇద్దామనుకుంటున్నారు’ అంటూ కొందరు ఫన్నీగా మీమ్స్ తయారు చేసి పోస్ట్ లు పెడుతున్నారు. ‘గిఫ్ట్ పెళ్లికూతురికి ఇవ్వాల్సింది.. అత్తామామలు, మొగుడు ఏమన్నా తేడాగా ప్రవర్తిస్తే ఉపయోగపడేది’ అంటూ మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఏకే 47 ఉండటమే నేరము. అది గిఫ్ట్‌గా ఇవ్వడమూ నేరమే. కాబట్టి పాకిస్థాన్ అధికారులు ఈ ఘటనపై ఏదైనా చర్యలు తీసుకుంటారా? లేక చూసిచూడనట్టు వదిలేస్తారా? అన్నది వేచి చూడాలి.