Begin typing your search above and press return to search.

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కు పాల్పడే వారిని గుర్తించేందుకు..బెట్టింగ్‌ ను చట్టబద్ధం చేయాలి!

By:  Tupaki Desk   |   20 Nov 2020 3:20 PM IST
మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కు పాల్పడే వారిని గుర్తించేందుకు..బెట్టింగ్‌ ను చట్టబద్ధం చేయాలి!
X
గేమ్ ఏదైనా ... ఆడేది ఎక్కడైనా అందులో బెట్టింగ్ , మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు అనేవి సర్వసాధారణం. ఒక చిన్న తరహా టోర్నమెంట్ నుండి ఐసీసీ నిర్వహించే భారీ టోర్నమెంట్స్ వరకు ప్రతి దాంట్లో ఫిక్సింగ్ ఆరోపణలు, బెట్టింగ్ కేసులు నమోదు అవుతూనే ఉంటాయి. ఇక ముఖ్యంగా క్రికెట్ లో ఈ తరహా ఆరోపణలు ఎక్కువగా వస్తుంటాయి. గల్లీ క్రికెట్ నుండి ఐపీఎల్ వరకు ప్రతిదాంట్లో కూడా ఫిక్సింగ్ ఆరోపణలే. దీన్ని ఎంతలా అరికట్టాలని అనుకుంటునప్పటికీ అది కుదరడంలేదు. అలాగే రోజురోజుకి పెరిగిపోతుంది.

ఇటువంటి సమయంలో కేంద్రమంత్రి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయడం ద్వారా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వంటి అనుచిత విధానాలను అరికట్టవచ్చవని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అభిప్రాయం వ్యక్తం చేసారు. దీనివల్ల ప్రభుత్వానికి పన్నుపరమైన ఆదాయాలు కూడా లభించవచ్చన్నారు. గురువారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బెట్టింగ్ ‌ను చట్టబద్ధం చేయాలంటూ ప్రధాని ఆర్థిక సలహా మండలి పార్ట్‌ టైమ్‌ సభ్యుడు నీలేష్‌ షా చేసిన వ్యాఖ్యలపై ఠాకూర్‌ ఈ మేరకు స్పందించారు.

ఇదిలా ఉంటే , ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ వంటి కొన్ని దేశాలు బెట్టింగ్ ను చట్టబద్ధం చేసిన సంగతిని ఆయన ఉదాహరణగా చూపారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, దీన్ని క్రీడలు లేదా ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించవచ్చని మంత్రి చెప్పారు. బెట్టింగ్‌ అన్నది వ్యవస్థాత్మకమైనదని, మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడే వారిని గుర్తించేందుకు దీన్ని ఉపయోగించు కోవచ్చని ఆయన వెల్లడించారు.