Begin typing your search above and press return to search.

ప‌న్నీర్‌..శేఖ‌ర్ రెడ్డి..ఆత్మీయ అనుబంధం

By:  Tupaki Desk   |   10 May 2017 8:55 AM GMT
ప‌న్నీర్‌..శేఖ‌ర్ రెడ్డి..ఆత్మీయ అనుబంధం
X
త‌మిళ‌నాడులో క‌ల‌క‌లం సృష్టిస్తున్న టీటీడీ బోర్డు స‌భ్యుడు, ఇసుక వ్యాపారి శేఖర్‌ రెడ్డి అవినీతి బాగోతం మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం మెడ‌కు చుట్టుకుంది. పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం భారీ స్థాయిలో న‌గ‌దుతో పాటు ప‌లువురు మంత్రులు - ఎమ్మెల్యేల‌కు లంచాలు ఇచ్చిన‌ట్లు తేల‌డం...ఈ విష‌యంలో ఐటీ నోటీసుల అంశం తమిళ‌నాడు స‌ర్కారును కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్‌ లో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. శేఖ‌ర్ రెడ్డిని రాష్ట్రానికి పరిచయం చేసింది మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వమేనని తెలిపారు.

అంతకు ముందు పన్నీర్‌ సెల్వం మంత్రిగా ఉన్నప్పుడే శేఖర్‌ రెడ్డి అన్ని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ష‌ణ్ముగం ఆరోపించారు. పన్నీర్‌ సెల్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే శేఖర్‌ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా నియమించారని ష‌ణ్ముగం వ్యాఖ్యానించారు. శేఖర్‌ రెడ్డి చేపట్టిన అన్ని ఇసుక కాంట్రాక్టులు పన్నీర్‌ సెల్వం కనుసన్నల్లోనే జరిగాయని ఆరోపించారు. ఇదే సమయంలోనే ఇసుక వ్యాపారంలో అనేక అక్రమాలు జరిగాయన్నారు. ఈ విషయంలో పన్నీర్‌ సెల్వంపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. శేఖర్‌ రెడ్డితో సంబంధంపై విచారణకు సిద్ధమేనా అని మాజీ ముఖ్యమంత్రిని ఆయన ప్రశ్నించారు.