Begin typing your search above and press return to search.
యూట్యూబ్ చూస్తూ.. ప్రియురాలికి ప్రసవం చేశాడు.. ఏం జరిగింది?
By: Tupaki Desk | 20 March 2020 2:00 PM GMTసినిమాల్లోనూ.. యూట్యూబ్ వీడియోల్లో చూసినప్పుడు చాలా సింఫుల్ గా అనిపించినా.. వాస్తవంలో అవి చాలా కష్టమైనవి.. క్లిష్టమైనవన్న విషయం వాటిని చేసేటప్పుడు కానీ ఆర్ట్ క్రాప్టులు చేయటం మామూలు కాదన్న విషయం అర్థమవుతుంది. అలాంటిది ఎలాంటి వైద్య విద్య మీద అవగాహన లేకుండా యూట్యూబ్ చూస్తే.. ప్రసవం చేయటం సాధ్యమా?
విన్నంతనే ఉలిక్కిపడేలా చేసే ఈ ఉదంతం వింటే షాక్ కు గురి కావాల్సిందే. తమిళనాడులోని గుమ్మడిపూండికి చెందిన 27 ఏళ్ల సౌందర్ అనే వ్యక్తి గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తుంటాడు. పెళ్లి చేసుకుంటానని ఒక కాలేజీ అమ్మాయికి దగ్గరయ్యాడు. ఆమె కాస్తా గర్బవతి అయ్యింది. శరీరంలో వచ్చిన మార్పుల గురించి తల్లిదండ్రులు ప్రశ్నిస్తే.. అనారోగ్యమని చెప్పి తప్పించుకునేది. ఈ క్రమంలో ఆమెకు నెలలు నిండాయి.
తాజాగా నొప్పులు రావటంతో ప్రియుడికి ఫోన్ చేసింది. వెంటనే అతడు.. ఒక షాపులో గ్లౌజులు.. కత్తెర.. బ్లేడ్ లాంటి సామాగ్రిని తీసుకొచ్చి.. టూవీలర్ మీద ఆమెను దగ్గర్లోని అడవికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను పడుకోబెట్టి.. సెల్ ఫోన్లో వీడియో చూస్తూ.. డెలివరీ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బ్లేడ్ తో కోయటంతో గర్భసంచిలోని శిశువు చేయి తెగిపోయింది. ఆమె పేగు కూడా తెగి.. తీవ్రమైన రక్తస్రావమైంది. దీంతో.. ఆ యువతి అపస్మారక స్థితికి చేరుకుంది.
దీంతో ఆమెను అతి కష్టమ్మీదా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. జరిగిందంతా చెప్పాడు. అప్పటికే ఆమె కడుపులో ఉన్న శిశువును బయటకు తీశారు వైద్యులు. అప్పటికే ఆ మగశిశువు మరణించాడు. యువతి ఆరోగ్యం నిలకడగా ఉంది. జరిగిన ఉదంతాన్ని వైద్యులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఆ యువకుడ్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇదంతా వింటే..నిజజీవితంలో ఇలాంటి సాహసాలు కూడా చేస్తారా? అన్న భావన రాక మానదు.