Begin typing your search above and press return to search.
జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న సీఎం.. వీడియో వైరల్
By: Tupaki Desk | 21 Aug 2021 8:04 AM GMTఒక సీఎం స్థాయి వ్యక్తి ఎంతో బిజీగా ఉంటాడు. ప్రతి క్షణం పాలన, పార్టీ వ్యవహారాలతో బిజీ బిజీగా ఉంటాడు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ ఆరోగ్యంగా ఉండాలని ఫిట్ నెస్ సాధించాలని కోరుకుంటారు. ఈ విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ అందరికంటే భిన్నంగా ఉన్నారు. ఫిట్ నెస్ పై శ్రద్ధ చూపిస్తున్నాడు.
తమిళనాడు సీఎంగా ఎంతో బిజీగా ఉండే స్టాలిన్ ఫిట్ నెస్ కు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాడు. 68 ఏళ్ల వయసులో కూడా జిమల్ లో వర్క్ ఔట్స్ చేస్తూ కండలు కరిగిస్తూ చమటలు చిందిస్తున్నారు.
రాజకీయాల్లో చాలా రోజులుగా ఉంటున్న తమిళనాడు సీఎం స్టాలిన్ చాలా ఫిట్ గా, స్లిమ్ గా ఉంటాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు.. ఇప్పుడు సీఎంగా అధికారంలో ఉన్నా స్టాలిన్ ఒక్క రోజు కూడా వర్కౌట్స్ చేయకుండా ఉండరని తెలుస్తోంది.
తాజాగా చెన్నై లోని జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. ప్రొఫెషనల్ ట్రైనర్ సమక్షంలోనే స్టాలిన్ జిమ్ చేస్తుంటారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ తనదైన శైలిలో పాలన చేస్తూ ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. కరోనా సమయంలో స్టాలిన్ ప్రజలకు అండగా నిలిచిన తీరు ఆకట్టుకుంది. ప్రభుత్వ కమిటీల్లో ప్రతిపక్ష నేతలకు స్థానం కల్పించిన సీఎంకు మంచి పేరు తెచ్చాయి. కక్ష పూరిత రాజకీయాలకు బ్రేక్ వేస్తూ పేదల ఆకలి తీర్చే ప్రభుత్వ క్యాంటీన్లను అదే పేరుతో కొనసాగిస్తున్న స్టాలిన్ ను ప్రతిపక్షాలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నాయి.