Begin typing your search above and press return to search.

ఓట్ల కోసం మమత అత్తరు ప్లాన్

By:  Tupaki Desk   |   1 May 2019 6:23 AM
ఓట్ల కోసం మమత అత్తరు ప్లాన్
X
బెంగాల్ సీఎం - తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో గెలుపుకోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. ప్రధాని మోడీ.. బీజేపీ నేతలను బెంగాల్ లో ప్రచారం చేయనీయకుండా మమత వేసిన ఎత్తులు అన్నీ ఇన్నీ కావు.. వారి హెలీక్యాప్టర్లకు అనుమతులు ఇవ్వకపోవడం.. ర్యాలీలను నిషేధించడం.. ఇలా అధికారంలో ఉండి బీజేపీ వాసనను భరించలేకపోయింది మమతా బెనర్జీ..

ఇక మమత అంత దూకుడుగా ముందుకు వెళ్తుంటే ఆ పార్టీ నాయకులు ఊరుకుంటారా.? వారు కూడా ఈ ఎన్నికల్లో వినూత్న ఆలోచనతో పార్టీ గెలుపునకు స్కెచ్ లు గీశారు. ఆ స్కెచ్ చూసి ఇప్పుడు అందరూ ముక్కున వేలేసుకున్నారు.

ఈవీఎంలలో తృణమూల్ అభ్యర్థులకే ఓటు వేయాలని.. ప్రజలను కోరిన నేతలు.. వారు వేస్తున్నారా లేదో తెలుసుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేశారు. తృణమూల్ గుర్తు ఉన్న ఈవీఎం బటన్ పై అత్తరు సెంట్ ను పూశారు. ఇలా గంటకోసారి తృణమూల్ కార్యకర్తలు ఓటు వేస్తూ సెంట్ పూసి వచ్చారు. ఎవరైతే తృణమూల్ గుర్తుకు ఓటేస్తారా వారి చేతికి అత్తరు వాసన వస్తుంది. ఓటేయకపోతే రాదు.. ఇలా అందరూ ఓటర్లకు పరీక్ష పెట్టారు. ఓటు వేయని వారితో తృణమూల్ కార్యకర్తలు ఘర్షణ కూడా పడ్డారట.. ఇలా ఈ విషయం లీక్ కావడంతో బీజేపీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాయి. ఇలా తృణమూల్ గెలుపు కోసం చేసిన ఆగడాలు అన్నీ కావు..