Begin typing your search above and press return to search.
కేంద్రమంత్రి చేతిలో పేపర్లను లాగేసి చించిన దీదీ ఎంపీ.. సభలో దాడియత్నం జరిగిందా?
By: Tupaki Desk | 23 July 2021 5:00 AM GMTపెద్దల సభగా అభివర్ణించే రాజ్యసభలో గురువారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలుగు టీవీ చానళ్లు పెద్దగా పట్టించుకోని ఈ ఉదంతం గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. రాజ్యసభలో అలాంటి పరిస్థితి నెలకొందా? అన్నదిప్పుడు చర్చగా మారింది. అయితే.. ఈ వ్యవహారానికి కారణమైన దీదీ పార్టీకి చెందిన ఎంపీ చేస్తున్న ఆరోపణలు కొత్త దుమారానికి తెర తీస్తున్నాయి. రాజకీయ.. మీడియా.. పారిశ్రామికవేత్తల ఫోన్లపై కేంద్రంలోని మోడీ సర్కారు నిఘాకు పాల్పడిందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున రావటం.. దీనికి సంబంధించిన వరుస పెట్టి సంచలన కథనాల్ని పబ్లిష్ చేయటం ద్వారా రాపకీయ దుమారానికి తెర తీసింది ‘‘ది వైర్’’ మీడియా సంస్థ.
కేంద్రం వాడినట్లుగా ఆరోపణలు ఉన్న పెగాసస్ స్పైవేర్ వ్యవహారం ఇప్పుడు పెను రాజకీయ దుమారంగా మారిన సంగతి తెలిసిందే. అయితే.. వస్తున్న ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తున్న కేంద్రం.. స్పైవేర్ వాడినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేస్తోంది. అంతేకాదు.. దీనికి సంబంధించిన కథనాలు అవాస్తవాలంటూ కొట్టిపారేస్తున్నారు. ఈ ఉదంతంపై రాజ్యసభలో కేంద్రమంత్రి ఇస్తున్న వివరణ సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.
కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ పెగాసస్ స్పైవేర్ మీద వచ్చిన ఆరోపణలు సరైనవి కావంటూ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆయన వివరణ ఇచ్చే క్రమంలో అసాధారణ పరిణామం చోటు చేసుకుంది. కేంద్రమంత్రిచేతుల్లో ఉన్న పత్రాల్ని ఒక్క ఉదుటున లాగేసిన పశ్చిమబెంగాల్ అధికారపక్షానికి చెందిన రాజ్యసభ సభ్యులు వాటిని ముక్కలుగా చేసి.. రాజ్యసభ సభాధిపతి సీటుపైకి విసిరేశారు. ఈ అనూహ్య పరిణామంతో సభ ఒక్కసారి షాక్ కు గురైంది. టీఎంసీ ఎంపీల తీరును పలువురు తప్పుపట్టారు.
వారిపై ప్రివిలేజ్ మోషన్ పెట్టాలని కేంద్రం భావించిన పరిస్థితి. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో టీఎంసీ ఎంపీల నుంచి వచ్చిన వాదనలు మరో రచ్చకు తెర తీశాయి. కేంద్రమంత్రి వైష్ణవ్ ప్రకటన సమయంలో.. ఆయన చేతిలోని కాగితాల్ని లాగేసుకొని.. చించేసి రచ్చ చేసిన టీఎంసీ ఎంపీల్ని అదుపులోకి తెచ్చేందుకు మార్షల్స్ రంగప్రవేశం చేశారు. పరిస్థితిని కాసేపట్లో అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం సభలో చోటు చేసుకున్న పరిణామాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు టీఎంసీ ఎంపీ శాంతనుసేన్. కేంద్రమంత్రి చేతుల్లో నుంచి పత్రాల్ని తీసుకొని చింపిన సమయంలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ కు.. టీఎంసీ ఎంపీ సేన్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే తనపై దాడి జరిగినట్లుగా టీఎంసీ ఎంపీ ఆరోపిస్తున్నారు.
‘‘సభలో మా ఎంపీలపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి తనపై దాడి చేయబోయారు. ఆ సమయంలో మిగిలిన ఎంపీలు మమ్మల్ని కాపాడారన్నారు. సభ వాయిదా పడిన తర్వాత కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ తనను బెదిరించటమే కాదు.. అసభ్యకరంగా మాట్లాడారు’’ అని ఎంపీ శాంతను పేర్కొన్నారు. ఈ ఉదంతంపై రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కు తాము ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే.. తమ సమావేశాలపై కేంద్రం నిఘా పెట్టిందని సంచలన వ్యాఖ్యలు చేసిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కేంద్రంలోని మోడీ సర్కారును గద్దె దింపటమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఖేలా హోబే నినాదంతో ఢిల్లీలో తాను పర్యటిస్తానని.. పలు పార్టీ నేతలతో భేటీ కానున్నట్లు ఆమె వెల్లడించారు. మొత్తంగా.. రాజ్యసభలో చోటు చేసుకున్న అనూహ్య ఘటన రానున్న రోజుల్లో మరింత రచ్చకు కారణమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.