Begin typing your search above and press return to search.

సేన ఎంపీ మాదిరే తృణ‌మూల్ లేడీ ఎంపీ వీరంగం

By:  Tupaki Desk   |   7 April 2017 2:29 PM GMT
సేన ఎంపీ మాదిరే తృణ‌మూల్ లేడీ ఎంపీ వీరంగం
X
విమానాల్లో ర‌చ్చ చేయ‌టం ఎంపీల‌కు అల‌వాటుగా మారుతుందా? అన్న సందేహం క‌లిగేలా మ‌రో ఉదంతం చోటు చేసుకుంది. కొద్దిరోజుల క్రితం ఎయిరిండియా ఉద్యోగిపై దాడి చేసిన శివ‌సేన ఎంపీ ర‌వీంద్ర గైక్వాడ్ వివాదం ఒక కొలిక్కి రాక‌ముందే.. తాజాగా అదే త‌ర‌హాలో మ‌రో ఎంపీ వీరంగం వేసిన ఉదంతం తెర మీద‌కు వ‌చ్చింది. తృణ‌మూల్ కాంగ్రెస్ కు చెందిన మ‌హిళా ఎంపీ ప్ర‌వ‌ర్త‌న ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ఢిల్లీ నుంచి కోల్ క‌తా వెళ్లే ఎయిరిండియా విమానాన్ని ఎక్కారు మ‌హిళా ఎంపీ డోలా సేన్‌. త‌న‌తో పాటు ఆమె త‌న త‌ల్లిని కూడా తీసుకొచ్చి అత్య‌వ‌స‌ర ద్వారా వ‌ద్ద కూర్చోబెట్టారు. అయితే.. ఇందుకు ఎయిరిండియా సిబ్బంది అడ్డుప‌డ్డారు. ఎంపీగారి త‌ల్లిగారు వృద్ధురాలైనందున అత్య‌వ‌స‌ర ద్వారం వ‌ద్ద కూర్చోబెట్ట‌టం స‌రికాద‌ని.. వేరే సీట్లో కూర్చోబెడ‌తామ‌ని సూచించారు. ఆమెకు అనువైన సీటును కేటాయించామ‌ని చెప్పారు.

అయితే.. ఎయిరిండియా సిబ్బంది సూచ‌న‌లకు నో చెప్పారు తృణ‌మూల్ ఎంపీ. త‌మ విన్న‌పాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా విమాన‌సిబ్బంది ఎంత కోరినా ఎంపీ డోలాసేన్ మాత్రం త‌న వీరంగాన్ని ఆప‌లేదు. ఎయిరిండియా సిబ్బంది వాద‌న‌కు క‌న్వీన్స్ కాలేదు. దీంతో.. విమానాన్ని 30 నిమిషాల పాటు నిలిపివేయాల్సి వ‌చ్చింది.

ఎయిరిండియా ఉద్యోగుల‌పై పెద్ద ఎత్తున విరుచుకుప‌డిన డోలా సేన్ తీరుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఉదంతంపై ఎయిరిండియా కానీ.. డోలా సేన్ కానీ ఇప్ప‌టివ‌ర‌కూ వివ‌రాల్ని వెల్ల‌డించ‌లేదు. శివ‌సేన ఎంపీ ర‌వీంద్ర గైక్వాడ్ వివాదం ఒక కొలిక్కి రాక‌ముందే.. ఎయిరిండియా సిబ్బందిప‌ట్ల దురుసుగా వ్య‌వ‌హ‌రించిన మ‌రో ఎంపీ ఉదంతం వెలుగులోకి రావ‌టం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/