భర్త నుంచి విడిగా అయినా గర్భిణి.. నటి కం ఎంపీ వివరణ!

Wed Jun 09 2021 18:02:16 GMT+0530 (IST)

tmc mp and actress nusrat jahan announces to end up relation with her husband nikhil jain

అందాల కథానాయిక.. తృణమూల్ ఎంపి నుస్రత్ జహాన్- నిఖిల్ జైన్ వైవాహిక జీవితంలో కలతలపై ఇటీవల మీడియాలో వరుస కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఆమె గర్భిణి.. కానీ అది కోస్టార్.. ప్రియుడు యష్ వల్ల..! అంటూ ఒక సెక్షన్ మీడియా చేసిన ప్రచారంతో నుస్రత్ తాజాగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు.విడాకులు ఇవ్వకుండా ఇలా చేయొచ్చా? అంటూ కొందరు ప్రశ్నించడం చర్చనీయాంశమైంది.  దీనిపై నుస్రత్ వివరణ ఇస్తూ.. నిఖిల్ జైన్ తో వివాహం భారతదేశంలో ఎప్పుడూ చెల్లుబాటు కాదని అన్నారు. భారతదేశంలో తన వివాహం చట్టబద్ధం కానందున విడాకులు అవసరం లేదని ఎంపి నుస్రత్ జహాన్ అన్నారు. చాలా కాలం క్రితమే తాను భర్త నుంచి విడిగా ఉంటున్నానని నుస్రత్ తెలిపారు. నిఖిల్ పేరు పెట్టకుండా.. తన బ్యాంక్ ఖాతాలను అతడు దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. త్వరలో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

నుస్రత్ జహాన్ వివరణ ప్రకారం.. భారతదేశంలో ఇంటర్ ఫెయిత్ వివాహం ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం ధ్రువీకరణ అవసరం.. కానీ ఇది తమ విషయంలో ఎప్పుడూ జరగలేదు. మా వివాహం చట్టబద్ధమైనది.. చెల్లుబాటు అయ్యేది కాదు .. విడాకుల ప్రశ్న లేనే లేదు... అని ఆమె స్పష్టం చేసింది. మేం చాలా కాలం క్రితం విడిపోయాం. కానీ నా వ్యక్తిగత జీవితం ప్రైవసీ కావాలనే నేను దాని గురించి మాట్లాడలేదు`` అని లేడీ ఎంపి అన్నారు.

లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించి రాజకీయంగా అడుగుపెట్టిన తర్వాత నుస్రత్ జహాన్ 2019 లో టర్కీలోని బోడ్రమ్ లో వ్యాపారవేత్త నిఖిల్ జైన్ ను వివాహం చేసుకున్నారు. కోల్ కతాలో రిసెప్షన్ కూడా జరిగింది. దీనికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరయ్యారు. వివాహ వేడుక టర్కీ వివాహ నిబంధన ప్రకారం జరిగిందని ఎంపి స్పష్టం చేశారు.

2021 లో బెంగాల్ ఎన్నికలలో బిజెపి అభ్యర్థిగా ఉన్న తోటి నటుడు-రాజకీయ నాయకుడు యశ్ దాస్ గుప్తాతో నుస్రత్ డేటింగ్ చేస్తున్నట్లు కథనాలు రావడంతో తన వివాహబంధంలో చీలికలు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం నుస్రత్ యష్ బిడ్డను మోస్తున్నట్లు వార్తలు రావడంతో అది పెను సంచలనమైంది. భర్త నిఖిల్ తనకు తెలియకుండా అనుమతి లేకుండా తన బ్యాంక్ ఖాతాల నుండి నిధులను దుర్వినియోగం చేశారని.. ఆభరణాల కొనుగోళ్లలో తప్పుడు విధానం అనుసరించారని ఆరోపించారు.

నిఖిల్ జైన్ కోల్ కతాకు చెందిన వ్యాపారవేత్త.. వీరిద్దరూ వివాహం చేసుకోవడానికి ఒక సంవత్సరం ముందు కోల్ కతాలో ఒక కార్యక్రమంలో కలుసుకున్నారు. ఇటీవల నుస్రత్ గర్భం గురించి పుకార్లు రావడంతో కొన్ని న్యూస్ ఛానల్స్ నిఖిల్ ను సంప్రదించాయి. చాలా నెలలుగా కలిసి లేని కారణంగా నుస్రత్ గర్భం గురించి తనకు తెలియదని నిఖిల్ మీడియాకి చెప్పారు.