Begin typing your search above and press return to search.

ప‌వ‌న్-కు తిరుప‌తి ఫ్యాన్స్ ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా?

By:  Tupaki Desk   |   30 May 2022 8:30 AM GMT
ప‌వ‌న్-కు తిరుప‌తి ఫ్యాన్స్ ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా?
X
రానున్న ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌నుక తిరుప‌తి నుంచి పోటీ చేస్తే ల‌క్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామ‌ని ఆ పార్టీ నాయ‌కులు అంటున్నారు.ఇవాళ తిరుప‌తిలో జ‌రిగిన తిరుప‌తి ప‌ట్ట‌ణ క‌మిటీ నూత‌న కార్య‌వ‌ర్గ ప్ర‌మాణ స్వీకారోత్స‌వాన్ని నిర్వ‌హించారు.ఈ సందర్భంగా ముఖ్య నేత‌లు చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి మాట్లాడి, దిశా నిర్దేశం చేశారు.

మరోవైపు ప‌వ‌న్ ను ఇచ్ఛాపురం నుంచి పోటీ చేయించాల‌న్న ఆలోచ‌న కూడా కొంద‌రిలో ఉంది. ఇవేవీ కాకుండా అనంత‌పురం జిల్లా నుంచి పోటీ చేయించాల‌న్న ప్ర‌తిపాద‌న కూడా ఒక‌టి వినిపించింది. వీటిపై ఎటువంటి స్ప‌ష్ట‌త లేక‌పోయినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఎక్క‌డ పోటీ చేసినా పొత్తు ధ‌ర్మంలో భాగంగా అటు బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ ఆయ‌న గెలుపున‌కు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌తో స‌హా ప‌నిచేయాల్సి ఉంది.

ఇక జ‌న‌సేన కూడా క్షేత్ర స్థాయి కార్యాచ‌ర‌ణ‌ను ఉద్ధృతం చేస్తే మంచి ఫ‌లితాలు వ‌స్తాయి. తిరుప‌తి అనేకాదు అన్ని చోట్ల ప‌ట్ట‌ణ కార్య‌వ‌ర్గాల ఏర్పాటు, త‌రువాత వాటి కార్యాచ‌ర‌ణ అన్న‌వి వేగంగా జ‌ర‌గాల్సి ఉంది. ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ ను ఉభ‌య గోదావ‌రి జిల్లాల నుంచి ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయించి పోగొట్టుకున్న చోటే రాబ‌ట్టుకుని తీరాల‌న్న విధంగా ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు ఇంకొంద‌రు అభిమానులు. భీమవ‌రంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీ‌ను పై వ్య‌తిరేక‌త ఉన్న దృష్ట్యా, దీనిని త‌మ‌కు అనుగుణంగా మార్చుకోవాల‌ని చూస్తున్నారు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు.

అయితే ఇది కూడా అనుకున్నంత సులువు కాదు. అధికార పార్టీని దాటించి ప‌నిచేయ‌డం అనుకున్నంత సులువు కాదు. ప‌వ‌న్ గెల‌వాల‌న్నా లేదా మంచి మెజార్టీతో ప‌రువు నిల‌బెట్టుకోవాల‌న్నా అందుకు చంద్ర‌బాబు త‌ర‌హా వ్యూహం కూడా ఉండాలి. ఇప్ప‌టి ఎన్నిక‌ల్లో వ్యూహాలే ముఖ్యం. కేవ‌లం విలువ‌లు ఒక్క‌టే స‌రిపోవు. గ‌తంలో కూడా భీమ‌వ‌రం మ‌రియు గాజువాక నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి ఆ రోజు ఒక్కో నియోజ‌క‌వ‌ర్గానికి 100 కోట్లకు పైగా వైసీపీ వెచ్చించి త‌న వారిని గెలుపున‌కు కృషి చేసింద‌న్న రూమ‌ర్లు వ‌చ్చాయి. అయితే వీటిని వైసీపీ ఖండించింది కానీ ఆ రెండు స్థానాలలో జ‌రిగిన మాయాజాలాన్ని జన‌సేన నిరూపించుకోలేక‌పోయింద‌న్న విమ‌ర్శ ఇవాళ్టికీ ఉంది.

మ‌రి! రానున్న కాలంలో వైసీపీ తో పోరులో భాగంగా జ‌న‌సేన ఏ విధంగా త‌న వ్యూహాల‌ను మార్చుకోనుందో తెలియాల్సి ఉంది.