Begin typing your search above and press return to search.
అభ్యర్ది ప్రకటనకు ముహూర్తం కుదిరిందా ?
By: Tupaki Desk | 16 Dec 2020 11:30 AM GMTపార్టీ వర్గాల సమాచారం ప్రకారం అలాగే అనిపిస్తోంది. తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక ప్రధాన పార్టీల్లో హీట్ పెంచేస్తోంది. అందుకనే ముందుగానే తెలుగుదేశంపార్టీ తరపున పనబాక లక్ష్మి పోటీ చేస్తారని చంద్రబాబునాయుడు ప్రకటించేశారు. అభ్యర్ధి ఎవరో ప్రకటించకపోయినా బీజేపీ చేస్తున్న హడావుడి మామూలుగా లేదు. ఇక అధికార వైసీపీ కాస్త వెనకబడిందనే చెప్పాలి. అనధికారికంగా డాక్టర్ గురుమూర్తే అభ్యర్ధి అన్న విషయం ప్రచారంలో ఉంది. అయితే ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ప్రకటించాల్సుంది.
అభ్యర్ధి ప్రకటనకు జగన్ ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు పార్టీలో ప్రచారంలో ఉంది. ఈనెల 25వ తేదీన రాష్ట్రంలోని అర్హులైన పేదలకు ఇళ్ళపట్టాల పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం పెట్టింది. సుమారు 33 లక్షల ఇళ్ళపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జగన్ ఆరోజు ప్రారాభించబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి మొదలయ్యే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లాలో ప్రారంభించబోతున్నారు. చిత్తూరులోనే జగన్ పథకాన్ని ప్రారంభించటం వ్యూహాత్మకం.
మొదటిదేమో చంద్రబాబునాయుడు సొంత జిల్లా. ప్రత్యేకించి చిత్తూరు జిల్లాకు చేయడం ద్వారా ఆయనను రాజకీయంగా డ్యామేజ్ చేయొచ్చు అని జగన్ అభిప్రాయం. అందుకనే జగన్ వ్యూహాత్మకంగా ఈ జిల్లాను ఎంచుకున్నారు. అంతేగాకుండా తొందరలో తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక ఉండటమే.
తిరుపతి లోక్ సభ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో తిరుపతి హెడ్ క్వార్టర్స్ తో కలిసి శ్రీకాళహస్తి కూడా ఒకటి. కాబట్టి ఇళ్ళ పట్టాల పంపిణీ తిరుపతిలో కానీ లేకపోతే శ్రీకాళహస్తిలో కానీ జరిగే కార్యక్రమంలో జగన్ ప్రారంభిస్తారు. అంటే జగన్ ఎక్కడ పాల్గొంటారనే విషయం మాత్రం ఇంకా నిర్ణయం కాలేదు. తిరుపతి అంటే హెడ్ క్వార్టర్స్ సరే. మరి శ్రీకాళహస్తి ఎందుకు ?
ఎందుకంటే, వైసీపీ తరపున పోటీ చేస్తారని ప్రచారంలో ఉన్న డాక్టర్ గురుమూర్తిది శ్రీకాళహస్తిలోని ఏర్పేడు మండలమట. ఎలాగూ కార్యక్రమం సందర్భంగా భారీ ఎత్తున బహిరంగసభ కూడా ఉంటుంది. తమ అభ్యర్ధిని ప్రకటించటానికి, జనాలకు పరిచయం చేయటానికి ఇదే మంచి సందర్భంగా జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. కాబట్టి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వైసీపీ అభ్యర్ధి ప్రకటనకు ముహూర్తం డిసెంబర్ 25 అని అర్ధమవుతోంది.