Begin typing your search above and press return to search.

తిరుపతి ఉప ఎన్నిక : వైసీపీ దూకుడు .. వ్యూహాలు సిద్ధం !

By:  Tupaki Desk   |   15 Dec 2020 10:00 AM GMT
తిరుపతి ఉప ఎన్నిక :  వైసీపీ దూకుడు .. వ్యూహాలు సిద్ధం !
X
ఆంధ్రప్రదేశ్‌ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ దుర్గాప్రసాద్ అకాల మరణం కారణంగా జరగనున్న ఈ ఉప ఎన్నికలపై రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్ని కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అయితే , ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ, గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టాయి. టీడీపీ ఇప్పటికే పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించగా వైఎస్సార్‌సీపీ డాక్టర్ గురుమూర్తిని బరిలోకి దింపుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇక జనసేన, బీజేపీలు అభ్యర్థి ఎంపికపై క్లారిటీకి రాలేదు.

ఇదిలా ఉంటే వైఎస్సార్‌సీపీ కూడా ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టింది. తిరుపతిలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా ముందుగానే ప్రణాళికలు రూపొందించుకోవాలని నిర్ణయించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని మంత్రులు సూచించారు. ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోనే సీఎం జగన్‌ ద్వారా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 25న ఏర్పాటు చేయాలనే అభిప్రాయానికి వచ్చారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత డిసెంబర్ 27 వ తేదీన పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రాంతాల వారీగా ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.