Begin typing your search above and press return to search.

తిరుమల దిశగా టీడీపీ నిర్దేశం

By:  Tupaki Desk   |   14 Nov 2015 12:52 PM IST
తిరుమల దిశగా టీడీపీ నిర్దేశం
X
టీడీపీ నేతలకు పుణ్యం పురుషార్దం రెండూ దక్కినట్లువుతోంది. తిరుపతిలో నిర్వహిస్తున్న టీడీపీ దిశానిర్దేశం కార్యక్రమానికి వచ్చిన ఆ పార్టీ నేతలంతా పనిలో పనిగా తిరుమల వెంకన్న దర్శనానికి లైను కడుతున్నారు.

తిరుపతిలో టీడీపీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి ఎమ్మెల్యేలు - ఎంపీలు - మంత్రులు - ఇతర ముఖ్యులంతా హాజరయ్యారు. వారంతా సమావేశాల్లో పాల్గొనడంతో పాటుగా సమయం చిక్కగానే తిరుమల వెంకన్న దర్శనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా మంత్రులు పెద్ద సంఖ్యలో ఏడుకొండలవాడి దర్శనం చేసుకున్నారు. దీనికోసం ముందు రోజు రాత్రే కొందరు కొండపైకి చేరుకుని అక్కడే ఉండి ఉదయాన్నే వీఐపీ దర్శనాల ప్రారంభ సమయంలోనే శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం కేంద్ర మంత్రి సుజనా చౌదరి - ఏపీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి - కొల్లు రవీంద్ర - కిమిడి మృణాళిని - దేవినేని ఉమా - ఎంపీలు కేశినేని నాని - మాగంటి బాబు - ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు తదితరులు వీఐపీ దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ - ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బోస్లే కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

నేతల వెంట అనుచరగణం కూడా భారీగానే ఉండడం... వారి వాహనాలు - భద్రత నేపథ్యంలో తిరుమల కిటకిటలాడుతోంది.