Begin typing your search above and press return to search.

యాదాద్రి , తిరుమలలో ప్రారంభమైన సర్వదర్శనాలు ... !

By:  Tupaki Desk   |   8 Jun 2020 7:10 AM GMT
యాదాద్రి , తిరుమలలో ప్రారంభమైన సర్వదర్శనాలు ... !
X
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో , అలాగే తిరుమల శ్రీవారి ఆలయంలో సర్వదర్శనాలు ప్రారంభమైయ్యాయి. లాక్ డౌన్ కారణంగా మూతబడ్డ ప్రముఖ ఆలయాల్లో లాక్ డౌన్ నుండి సడలింపులు ఇవ్వడంతో తిరిగి సర్వదర్శనాలు ప్రారంభమైయ్యాయి. ఈ రెండు ప్రముఖ ఆలయాల్లో కూడా తోలి రోజు ట్రయల్ రన్‌ నిర్వహిస్తున్నారు. ముందుగా ఆలయ సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు, స్థానికులకు ఈ రోజు అవకాశం కల్పిస్తున్నారు. యాదాద్రిలో రేపటి నుంచి భక్తులందరికీ దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు దేవస్థానం సిబ్భంది. ఇక తిరుమలలో జూన్ 10వ తేదీ నుంచి స్థానికులకు శ్రీవారి దర్శనభాగ్యం కల్పించనుండగా.. ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 7.30 వరకు దర్శనాలకు ఏర్పాట్లు చేసింది.

ఆలయాల్లో మాస్కులు ధరించటం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి చేశారు. లడ్డు ప్రసాద కౌంటర్ల వద్ద తగిన ఏర్పాట్లు చేయనున్నారు. ఆలయంలోపల తీర్థ ప్రసాదాలను నిషేధించారు. దేవస్థానం అనుమతించే వరకు చిన్నపిల్లలు, వ‌ృద్ధులు దర్శనాలకు రావొద్దని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇక యాదాద్రిలో ఆలయానికి చేరుకొనేందుకు కొన్ని ఆంక్షలు విధించారు. కొండ కింది నుంచి భక్తులు కాలినడకనే ఆలయానికి చేరుకోవాలని నిబంధన విధించారు. కొండపైకి ఏ వాహనాలకు అనుమతివ్వబోరని అధికారులు వెల్లడించారు. అలాగే, లాక్ ‌డౌన్ ‌కు ముందు యాదాద్రి కొండపై సత్యనారాయణ స్వామి వ్రతాల కోసం ఒక్కో బ్యాచ్‌ కు ఒక హాల్‌లో 250 జంటలు పూజకు కూర్చునేలా అనుమతించేవారు. కానీ, ప్రస్తుతం ఒక్కో బ్యాచ్‌‌ కు 50 మంది దంపతులు మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక తిరుపతిలో తోలి రెండు రోజులు టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు దర్శనాలు చేసుకుంటున్నారు. జూన్ 10 నుండి గంటకు ఐదు వందల మంది చొప్పున, రోజుకు ఆరు వేల మందికి దర్శనం కల్పించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. మూడు వేల మందికి ప్రత్యేక దర్శనం, మరో మూడు వేల మందికి సాధారణ దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు. దర్శనాలు తిరిగి ప్రారంభమైన వేళ, స్వామివారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. పూలు, పండ్లతో ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. భక్తులకు దర్శనాలు కల్పించేందుకు మార్కింగ్ లైన్స్, భౌతిక దూరాన్ని పాటిస్తూ, నిలబడేందుకు ప్రత్యేక బాక్స్ లు, ఎక్కడికక్కడ శానిటైజర్లు అమర్చారు అధికారులు. ఏదేమైనా మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు ఓపెన్ కావడంతో ..భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.