Begin typing your search above and press return to search.

శృంగారం ఎక్కువ సేపు చేయాలంటే ఈ టిప్స్ పాటించండి

By:  Tupaki Desk   |   29 Aug 2021 2:30 AM GMT
శృంగారం ఎక్కువ సేపు చేయాలంటే ఈ టిప్స్ పాటించండి
X
శృంగారం.. అనే పదం వినగానే చాలా మంది సిగ్గుపడుతుంటారు. కానీ దాన్ని ఆస్వాదించిన వారు మాత్రం హ్యపీగా ఫీలవుతారు. అయితే శృంగారం అనగానే బెడ్రూంలో ఏదో చేయడం మాత్రమే కాదు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే అఫేక్షన్ కూడా. భార్యభర్తలు తమ ప్రేమానురాగాలను పంచుకోవడానికి బెడ్రూంనే వేదికగా చేసుకోనక్కర్లేదు. దానికి అనేక మార్గాలున్నాయని సైకాలజిస్టులు తెలుపుతున్నారు.

అసలు శృంగారం అంటే అర్థం అదేనా..? మరేదేన్ని శృంగారం అంటారు..? శృంగారంలోకి దిగేందుకు ఏయే పద్ధతులు పాటించాలి..? ఒక ఆడ, మగ వ్యక్తుల కలయిక అమితానందాన్నిస్తుంది. భార్య భర్తల మధ్య ఇది అనుకున్న రేంజ్లో ఉంటే వారి లైఫ్ హ్యపీగా సాగుతుంది. వీరి లైఫ్ హ్యాపీగా సాగడానికి.. శృంగార క్రీడలోకి రావడానికి కొన్ని పద్ధతులు పాటించాలని కొందరు అంటున్నారు.

బెడ్రూం టైమ్ వచ్చేసరికి ఈ క్రీడలో పాల్గొనే వారు రెడీ అవుతారు. కానీ కొందరి మధ్య అనుకున్న సంతృప్తి ఉండదు. వీరి మధ్య సంతృప్తి రావాలంటే భాగస్వామిని సంతృప్తి పరచాలి. అంటే వారు అనుకున్న పని చేయాలి. అంటే వారితో కలిసి ఓ సారి షాపింగ్ కు వెళ్లండి. వారితో కలిసి దుస్తులు లేదా ఇతర వస్తులు కొనుగోలు చేయండి. షాపింగ్ చేసేటప్పుడు మిమ్మల్ని కొత్త దుస్తుల్లో చూసేసరికి భాగస్వామిలో కోరికలు పుట్టుకొస్తాయి. దీంతో షర్ట్ బాగుందీ, లేనిది తడిమి చూస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు ఎక్కువై బెడ్రూంకు వెళ్లాలని సంకేతాలు వస్తాయి.

భాగస్వామిని తృప్తి పరచాలంటే ఆమెతో కలిసి వర్కౌట్స్ చేయండి. ఇలా చెమటతో తడిసిన తన అందాలను చూస్తే ఎంజాయ్ చేయండి. మీ కండలను చూసి మీ పార్త్నర్లో కూడా కొత్త ఫీలింగ్స్ వస్తాయి. దీంతో శృంగార కోరికలు పుట్టుకొస్తాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ పనిలోకి వెళ్దామని అంటారు. ఇక మీ భాగస్వామితో కలిసి భోజనం చేయడానికి ప్రయత్నించండి. ఇలా ఒకరికొకరు తినిపించుకోవడం ద్వారా మీ వేళ్లు ఆమె.. ఆమె వేళ్లు పెదాలకు తాకడం వల్ల నరాల్లో జిల్ మంటుంది. దీంతో ఇద్దరి మధ్య అఫెక్సన్ ఏర్పడి శృంగార దారికి తలుపులు తెరుస్తాయి.

పర్యాటకం అంటే ఆడాళ్లకు చాలా ఇష్టం. కొంతమంది ఇంట్లోనే ఉండడం వల్ల వారికి కొత్త ప్రదేశాలు చూడాలని అసక్తి చూపుతారు. దీంతో మీ భాగస్వామితో కలిసి టూర్ కు ప్లాన్ వేయండి. మంచి వాతావరణం కలిగిన ప్రదేశాలకు వెళ్లడంతో ప్రశాంతమైన గాలితో మనసు ఉల్లాసంగా మారుతుంది. దీంతో కొత్త కొత్త ఆలోచనలతో శృంగార కోరికలు పుట్టవచ్చు.అంతేకాకుండా తాను అనుకున్న ప్రదేశానికి తీసుకెళ్లినందుకు కొందరు అక్కడే ఆగక ముద్దుల వర్షం కురిపించిన వాళ్లూ ఉన్నారు.

ఒక్కోసారి మంచి సంగీతం మనసును ప్రేరేపిస్తుంది. అలాంటి సంగీతానికి డ్యాన్స్ చేస్తే ఇద్దరిలో భావాలు బయటపడుతాయి. అలా మంచి భావాలు వ్యక్తపరుస్తూ ఒకరికొకరు ఆలింగనం చేసుకోవడానికి దారి తీస్తాయి. ఆ తరువాత ఇద్దరి శరీరాలు కలవడం వల్ల శృంగార వాతావరణం ఏర్పడుతుంది. ఇక ఆ తరువాత వెంటనే రూంలోకి వెళ్లాలనే తపన కూడా కలుగుతుంది.

శృంగారం అనగానే కొందరు ఏదో చేశాము లే అనట్లుగా హడావుడిగా బెడ్ పైకి వస్తారు. తొందరగా పని కానిచ్చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల మీ భాగస్వామిలో అసంతృప్తి జ్వాల మొదలవుతుంది. దీంతో రాను రాను మీమ్మల్ని దూరం పెట్టే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రేమానురాగాలను పంచుతూ వారికి అవసరమైన చిన్న చిన్న కోరికలను తీరుస్తూ సంతృప్తి కలిగించాలంటున్నారు మానసిక వైద్యులు.