Begin typing your search above and press return to search.
మహమ్మారికి ఏడాదిలోపు వ్యాక్సిన్?
By: Tupaki Desk | 27 Jun 2020 9:10 AM GMTమహమ్మారి వైరస్ కు ఏడాదిలోపు వ్యాక్సిన్ వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్.వో) తెలిపింది. వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తి సరఫరాకు అంతర్జాతీయ సహకారం అత్యంత అవసరం అని తెలిపింది. మహమ్మారి మహమ్మారికి వ్యతిరేకంగా సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను తయారు చేయడానికి శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కాని వ్యాక్సిన్ తయారీకి ఒక సంవత్సరం అయినా పడుతుందని తాజాగా డబ్ల్యూహెచ్.వో చీఫ్ తెలిపారు.
యూరోపియన్ పార్లమెంట్ ఆరోగ్య కమిటీ ప్రతినిధులతో వీడియో-కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన డబ్ల్యూ.హెచ్.వో చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ వ్యాక్సిన్ కనుక త్వరగా వస్తే అందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.కానీ అందరికీ అందుబాటులోకి రావడం సవాలేనని తెలిపారు. కానీ టీకా ఖచ్చితంగా ఇప్పట్లో వస్తుందని చెప్పడం చాలా కష్టం అని టెడ్రోస్ చెప్పారు. వ్యాక్సిన్ ను వైరస్ బారినపడే వారికి మొదట ఇస్తామని.. బలహీనులకు తొలుత ఇచ్చే మార్గాలను అన్వేషిస్తున్నట్టు తెలిపారు.
మహమ్మారివైరస్ కోసం వ్యాక్సిన్ ఇప్పటికైతే లేదని.. అది కనుగొనబడుతుందని ఆశతో ఉన్నామని డబ్ల్యూహెచ్.వో అధిపతి తెలిపారు. టీకా కోసం డబ్ల్యూహెచ్‌ఓకు ఇప్పటికే 100 మందికి పైగా నివేదికలు పంపారని.. అందులో ఒకటి అభివృద్ధి దశలో ఉందని ఆయన అన్నారు.
టీకా ఒక సంవత్సరంలోపు అందుబాటులోకి వస్తుందని అంచనా. వేగవంతం చేస్తే అంత కంటే తక్కువ సమయంలోనే రావచ్చు. కానీ కొన్ని నెలలుగా శాస్త్రవేత్తలు ఇదే చెబుతున్నారని ఆయన అన్నారు.దీన్ని బట్టి కనీసం వ్యాక్సిన్ రావడానికి ఏడాది పడుతుందని డబ్ల్యూహెచ్.వో అధిపతి స్పష్టం చేశారు.