Begin typing your search above and press return to search.

టైమ్ మ్యాగజైన్ సరికొత్త ప్రయోగం

By:  Tupaki Desk   |   28 Oct 2020 10:50 AM GMT
టైమ్ మ్యాగజైన్ సరికొత్త ప్రయోగం
X
కరోనా మహమ్మారి రాకతో పత్రికలు పతనమయ్యాయి. జర్నలిస్టులను తీసేసి.. సర్క్యూలేషన్ తగ్గించి.. పేజీలను కుదించి ఏదో నడిపించాలి కాబట్టి నడిపిస్తున్నాయి. తీవ్ర నష్టాలతో ప్రపంచవ్యాప్తంగా చిన్న పత్రికలు మూతపడ్డాయి. ఈ గడ్డు పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి.

అయితే ఇలాంటి సమయంలో ప్రపంచంలోనే దిగ్గజ పత్రికగా పేరొందిన ‘టైమ్’ సరికొత్త ప్రయోగం చేసి పాఠకులను ఆకట్టుకుంటోంది. మార్కెట్ లో ఉన్న నవంబర్ 2 పత్రికను చూడండి అని టైమ్ పిలుపునిచ్చింది. అది చూసిన జనాలకు షాక్ తగిలింది.

ఆ పత్రిక పైభాగంలో ‘టైమ్’ అని ఉండదు. ‘ఓటు’ అనే పేరుతో తాజా సంచికను విడుదల చేయడం సంచలనమైంది. అమెరికాకు ఈ అధ్యక్ష ఎన్నికలు ఎంతో కీలకమైనవని.. అందుకే ఈ ముఖచిత్రాన్ని మార్చామని టైమ్ చెప్పింది. కవర్ పేజీలో ఓ మహిళ కర్ఛీప్ ను మాస్క్ లా పెట్టుకొని ఉంది. వెనుకలా ‘ఓటు’ అని టైమ్ ప్లేసులో పబ్లిష్ చేశారు. బ్యాలెట్ బాక్సును, బాక్సును కాపాడుతున్నట్టుగా అరచేతులు, ఇనుప సంకెళ్లు, మార్మికచిత్రాలు ఉన్నాయి. ప్రముఖ చిత్రకారుడు ఫ్రాంక్ షెఫర్డ్ ఈ చిత్రాలు గీశాడు.

97 ఏళ్ల చరిత్రలో టైమ్ ఇలా తన పేరుతో కాకుండా వేరే పేరుతో ప్రత్యేకసంచికను పబ్లిష్ చేయడం ఇదే తొలిసారి. అమెరికాలోనే అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ నిర్ణయాన్ని టైమ్ ప్రతిక తీసుకున్నట్టు సమాచారం.