Begin typing your search above and press return to search.

మోదీ గొప్పోడు అంటూనే.. చురకలంటించిన టైమ్

By:  Tupaki Desk   |   24 Sept 2020 11:00 AM IST
మోదీ గొప్పోడు అంటూనే.. చురకలంటించిన టైమ్
X
టైమ్​ మ్యాగజైన్​ విడుదల చేసే అత్యంత ప్రభావశీలురైన 100 మంది జాబితాకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో తెలియంది కాదు. అయితే ఇటీవల 2020 సంవత్సరపు జాబితాను విడుదలచేసింది ఈ మ్యాగజైన్​. ఈ జాబితాలో మోదీ సహా మరో ఐదుగురు భారతీయులకు చోటుదక్కింది. ఇందుకు సంతోషించాలో .. బాధపడాలో తెలియక బీజేపీ శ్రేణులు తికమకపడుతున్నాయి. జాబితాలో మోదీ పేరును ప్రకటించిన టైమ్​. మోదీ గురించి రాసిన వ్యాసంలో ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించింది. మోదీతోపాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, నటుడు ఆయుష్మాన్ ఖురానా, హెచ్ఐవీ పరిశోధకులు ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా, షహీన్ భాగ్ నిరసనల్లో పాల్గొన్న 82 ఏళ్ల బిల్కిస్ బానోకు కూడా ఈ జాబితాలో చోటుదక్కింది. అయితే మోదీపేరును జాబితాలో చేర్చిన టైమ్​ ఆయనను ఎందుకు చేర్చాలివస్తుందో వివరిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది

. టైమ్​లో పత్రికలో ఇలా రాశారు. ‘ప్రజలకు తమకు ఇష్టమైన వాళ్లను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యం.. కానీ ఎన్నికైన వ్యక్తి మాత్రం తనకు ఓటేసిన వాళ్లతో పాటు ఓటు వేయని వాళ్ల హక్కులను కూడా కాపాడాలి. కానీ ఇండియాలో అలా జరగడం లేదు. ప్రధాని మోదీ కేవలం ఒకవర్గం వాళ్ల ప్రయోజనాలు మాత్రమే కాపాడుతున్నారు. 136 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, జైనులు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుత ప్రధాని మోదీ మైనార్టీల హక్కులను కాలరాస్తున్నారు’ ఇలా సాగింది టైమ్​ కథనం.

ఈ కథనంపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. గత ఏడాది ఎన్నికలముందు టైమ్ మోదీ గురించి "ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్" శీర్షికన కవర్ పేజీలో కథనం ప్రచురించింది. ఈ స్టోరీ వివాదాస్పదమైంది. జాబితాలో తనపేరు ఉండంపై ఆయుష్మాన్​ ఖురానా హర్షం వ్యక్తం చేశారు. ఇది తనకు ఎంతో గర్వకారణమని సోషల్​మీడియాలో పోస్ట్​ పెట్టారు. ఈ జాబితాలో సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాషిన్​భాగ్​ లో జరిగిన నిరసనల్లో పాల్గొన్న బిల్కిస్ బానో పేరు కూడా ఉంది. ఉత్తర ప్రదేశ్ లోని బులంద్షహర్ జిల్లా కు చెందినవారు బిల్కిస్ బానో. ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, హెచ్ఐవీ పరిశోధకులు ప్రొఫెసర్ రవీంద్ర గుప్తాకు జాబితా లో చోటుదక్కింది.