Begin typing your search above and press return to search.

చిన్నారి కోసం అరుదైన జెర్సీని వేలానికి పెట్టాడు

By:  Tupaki Desk   |   30 Jun 2021 4:33 AM GMT
చిన్నారి కోసం అరుదైన జెర్సీని వేలానికి పెట్టాడు
X
అరుదైన క్యాన్సర్ తో బాధ పడుతున్న ఒక చిన్నారి (హోలీ బీటీ)ని రక్షించుకోవటం కోసం న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌధీ ముందుకు వచ్చాడు. మిగిలిన వారికి భిన్నమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇందుకోసం తాను ధరించిన జెర్సీని వేలం వేయటానికి సిద్ధమయ్యాడు. ఈ జెర్సీ ప్రత్యేకత ఏమంటే.. తాజాగా ముగిసిన ప్రపంచ కప్ టెస్టు ఫైనల్ మ్యాచ్ లో తాను ధరించిన జెర్సీని వేలానికి తీసుకొచ్చాడు. ఇందులో న్యూజిలాండ్ జట్టు సభ్యుల సంతకాలు ఉన్నాయి.

ఈ మ్యాచ్ లో భారత్ ను ఓడించి.. దాదాపు రెండు దశాబ్దాల (కచ్ఛితంగా చెప్పాలంటే 21 ఏళ్లు) తర్వాత కివీస్ ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో సౌధీ సైతం విశేషంగా రాణించాడు. మొత్తం ఐదు వికెట్లు పడగొట్టి.. భారత్ ట్రోఫీ ఆశల్ని ఆడియాసలు చేశారు. తాజాగా వైద్యం అవసరమైన పాపకు రూ.2.22 కోట్ల భారీ మొత్తంతోనే చికిత్స పూర్తి అవుతోంది.

దీంతో.. తన దగ్గరున్న అరుదైన జెర్సీని అమ్మకానికి తీసుకొచ్చాడు. దీని ద్వారా సమకూరిన మొత్తాన్ని ఆ చిన్నారి తల్లిదండ్రులకు అందించనున్నారు. సౌధీ మాదిరి ఇతర క్రికెటర్లు సైతం ముందుకు వస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. రెండున్నరేళ్లుగా క్యాన్సర్ తో ఆ చిన్నారి తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. మరి.. సౌధీని స్ఫూర్తిగా తీసుకొని..చిన్నారిని సేవ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు. ఏమైనా మంచి ఆలోచన చేసిన సౌధీని అభినందించక తప్పదు.