Begin typing your search above and press return to search.

టిమ్ పైన్ బావ కూడా మహానుభావుడే .. అదే మహిళతో భూతు చాటింగ్..!

By:  Tupaki Desk   |   22 Nov 2021 7:31 AM GMT
టిమ్ పైన్ బావ కూడా మహానుభావుడే .. అదే మహిళతో భూతు చాటింగ్..!
X
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో పనిచేస్తున్న ఓ జూనియర్ ఉద్యోగినితో అసభ్య చాటింగ్ చేసిన కారణంగా టిమ్ పైన్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం తెలిసిందే. తాజాగా అంతకంటే సంచలనాత్మక విషయం వెల్లడైంది. టిమ్ పైన్ బావ షానన్ టబ్ కూడా అదే మహిళతో అసభ్య చాటింగ్ చేసినట్టు తెలిసింది. షానన్ టబ్ గతంలో టాస్మేనియా రాష్ట్ర జట్టుకు ఆడాడు. క్రికెట్ నుంచి తప్పుకున్నాక టాస్మేనియాలోని ప్రిన్స్ ఆల్ఫ్రెడ్ కాలేజి కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. 2018 మధ్యలో క్రికెట్ టాస్మానియా ద్వారా టబ్ విచారణ జరిగింది. సదరు మహిళతో టిమ్ అడిలైడ్ ప్రిన్ అల్ఫెరెడ్ కాలేజీలో క్రికెట్ కోచ్‌ పనిచేస్తున్న సమయంలో ఆమెతో అసభ్యకరంగా చాట్ చేశాడట.

అప్పుడే అతడు తన ఉద్యోగాన్ని కూడా కోల్పోయినట్లు హెరాల్డ్ సన్ పత్రిక కథనం ప్రచురించింది. టబ్ క్రికెట్ టాస్మానియా నుంచి కూడా తప్పుకున్నాడట. టబ్‌ పై వచ్చిన పలు ఆరోపణలపై విచారణ చేపట్టగా, సదరు మహిళతో సెక్స్ చాటింగ్ చేసినట్లు వెల్లడైంది. టబ్ పై క్రికెట్ టాస్మానియా చర్యలు తీసుకున్నట్లు నివేదిక పేర్కొంది. హెరాల్డ్ సన్‌ లోని నివేదికల ప్రకారం, టిమ్ పైన్ సోదరిని వివాహం చేసుకున్న టబ్.. బామ్మర్ది టిమ్ చాటింగ్ చేసిన అదే మహిళతోనూ తాను అనుచితంగా ప్రవర్తించాడట. 2018 విచారణ తర్వాత క్రికెట్ టాస్మానియాలో టబ్‌ను కోచ్ పదవి నుంచి తొలగించారు.

అప్పుడు టబ్ కూడా ఆ మహిళను చాలా నెలల పాటు లైంగికంగా వేధించినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. టబ్ తనకు ఎక్స్-రేటెడ్ మెసేజ్ పంపాడని ఆమె పేర్కొంది. టబ్ కొన్ని అశ్లీల ఫొటోలను కూడా స్నాప్‌చాట్‌లో పంపినట్టు ఆమె ఆరోపించింది. 90లలో టాస్మానియాకు ప్రాతినిధ్యం వహించిన టబ్.. క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ తోనే ఉన్నాడు. అయితే క్రికెట్ టాస్మానియాను విడిచిపెట్టిన తర్వాత ఎలైట్ అడిలైడ్ ప్రైవేట్ పాఠశాలలో కోచ్‌ గా పనిచేశాడు.

మరోవైపు.. ఆసీస్ టెస్టు జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందే టిమ్ పైన్, సెక్స్ చాట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పలు టెక్ట్స్ మెసేజెస్ పైన్, సదరు మహిళ మధ్య ఎక్స్‌ఛేంజ్ అయినట్లు తెలిసింది. పైన్, ఆ మహిళకు అభ్యంతరకరమైన మెసేజెస్ పంపడమే కాకుండా తన నగ్న ఫొటోలను కూడా పంపినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై క్రికెట్ ఆస్ట్రేలియా విచారించగా, అందులో కూడా పైన్ చేసిన చాట్ నిజమేనని తేలింది. ఆసీస్ జట్టుకు కెప్టెన్ కాకముందే 2017లో ఈ వ్యవహారం జరిగింది. ఈ విషయం మరోసారి వెలుగులోకి రావడంతో టిమ్ పైన్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.