Begin typing your search above and press return to search.

చైనాకు షాకిచ్చిన హాంకాంగ్: భారత్ మాదిరి టిక్ టాక్ పై నిషేధం

By:  Tupaki Desk   |   8 July 2020 5:00 AM IST
చైనాకు షాకిచ్చిన హాంకాంగ్: భారత్ మాదిరి టిక్ టాక్ పై నిషేధం
X
చైనాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే భార‌త్‌ భారీ ఎత్తున యాప్స్ ను నిషేధించింది. నిషేధానికి గురైన‌ టిక్ టాక్ భారీ న‌ష్టాన్ని మూట‌గ‌ట్టుకుంది. ఫ‌లితంగా టిక్ టాక్ మాతృ సంస్థ 'బైట్‌డాన్స్'‌కు దాదాపు 6 బిలియ‌న్ డాల‌ర్ల ‌న‌ష్టం వాటిల్లింది. ఇది మరువకముందే టిక్ టాక్ కు మరో షాక్ తగిలింది. టిక్‌టాక్ హాంకాంగ్ మార్కెట్ నుంచి వైదొల‌గ‌నున్న‌ట్లు మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. హాంకాంగ్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడానికి కారణం చైనాపై ప్రతీకారం తీర్చుకోవడంలో ఓ భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

హాంకాంగ్ స్వ‌యంప్ర‌తిప‌త్తిని కాల‌రాస్తూ చైనా పార్ల‌మెంట్ ఇటీవ‌ల జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టానికి ఆమోదం తెలిపింది. దీంతో ఆ ప్రాంతంలలో తీవ్ర ఆందోళన.. నిరస‌న‌లు వ్యక్తమయ్యాయి. ప్రజలు ప్రత్యక్ష పోరాటంతో పాటు సోష‌ల్ మీడియాలో కూడా ఆందోళనలు చేస్తున్నారు.

ఇప్పుడు చైనాపై భారత్ స్ఫూర్తితో డిజిటల్ స్ర్టైక్స్ అమలు చేసింది. అందులో భాగంగా హాంకాంగ్ టిక్‌టాక్ వినియోగాన్ని నిలిపివేయాల‌ని నిర్ణ‌యించింది. ఇందుకోసం టిక్‌టాక్ నిర్వాహ‌కుల‌తోనూ అక్క‌డి ప్ర‌భుత్వ అధికారులు సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. ఈ క్రమంలోనే టిక్‌టాక్ త‌న‌ కార్య‌క‌లాపాల‌ను హాంకాంగ్‌లో నిలిపివేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.

అయితే ప్ర‌భుత్వ అభ్య‌ర్థ‌న‌లను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకోలేద‌ని టిక్ టాక్ ప్రకటించింది. అక్క‌డ నెల‌కొన్న ప‌రిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణ‌యానికొచ్చిన‌ట్లు వివ‌రణ ఇచ్చింది. ఈ నిర్ణయంతో 1,50,000 మంది యూజ‌ర్ల‌ను టిక్‌టాక్ కోల్పోతోంది.