Begin typing your search above and press return to search.

ప్లే స్టోర్ నుంచి ఆ చైనా యాప్స్ తొలగింపు

By:  Tupaki Desk   |   30 Jun 2020 3:15 PM IST
ప్లే స్టోర్ నుంచి ఆ చైనా యాప్స్ తొలగింపు
X
సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడడంతో భారతదేశంలో చైనాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా చైనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా ఆ దేశానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటోంది. జాతీయ భద్రత, గోప్యతా సమస్యలపై భారత ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో చైనాకు సంబంధించిన టిక్ టాక్ తో సహా 59 మొబైల్ యాప్స్ నిషేధించింది. సోమవారం దీనిపై ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్ పై నిషేధం విధించగా తాజాగా ప్లే స్పోర్ట్స్ నుంచి గూగుల్ తొలగిస్తూ నిర్ణయించింది. ఈ యాప్స్ పై నిషేధం విధించినట్టుగా తెలుస్తుంది.

వీటి వ‌ల్ల దేశ భ‌ద్ర‌త‌కే ముప్పు ఉంద‌ని హెచ్చ‌రికలు జారీ చేయడంతో నిఘావర్గాల సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వ వాటిని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. చైనాతో లింక్ ఉన్న యాప్ లేదా సాఫ్ట్‌వేర్‌లను ఉప‌యోగించ‌డం ద్వారా డేటా చోరీకి గురయ్యే అవ‌కాశం ఉంద‌ని నిఘా విభాగం అధికారులు భావించి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.


టిక్‌టాక్, యూసీ బ్రౌజ‌ర్, జెండ‌ర్, షేర్ఇట్, క్లీన్ మాస్ట‌ర్ స‌హా 59 ఇత‌ర మొబైల్ అప్లికేష‌న్ల ద్వారా డేటా త‌స్కర‌ణ‌కు గుర‌వుతుంద‌ని నివేదిక‌లు అందడంతో వారిని నిషేధించారు. కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో అధికారులు గూగుల్‌, యాపిల్‌ సంస్థలకు నిన్ననే ఉత్తర్వులను పంపగా భారత్‌లో గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌ల నుంచి ఆ 59 యాప్ లను ఆయా స్టోర్స్ నుంచి తొలగించారు.

టిక్‌టాక్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్ నుంచి తొలగించబడింది. జనాదరణ పొందిన చైనీస్ యాప్ భారతదేశంలోనే 120 మిలియన్లకు పైగా క్రియాశీల వినియోగదారులను కలిగి ఉంది. మంగళవారం ఉదయం నుంచి అవి తొలగించబడ్డాయి. టిక్ టాక్ స్టాటిస్టిక్స్ చూసినట్లయితే 100 బిలియన్ డాలర్ల గ్లోబల్ రెవెన్యూ అన్న టిక్ టాక్ కు 3 బిలియన్ డాలర్ల గ్లోబల్ ప్రాఫిట్ ఉంది. రెండు బిలియన్ ల డౌన్ లోడ్స్ టిక్ టాక్ యాప్ కు ఉన్నాయి.

2019 సంవత్సరంలో 400 మిలియన్ల ఇండియన్స్ టిక్ టాక్ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పటివరకు మొత్తంగా ఇండియాలో 611 మిలియన్ల టిక్ టాక్ యూజర్స్ ఉన్నారు. 2019 సంవత్సరంలో 5.5 బిలియన్ల గంటల సమయాన్ని ఇండియన్స్ టిక్ టాక్ మీద గడిపారు. భారతదేశ భద్రత, రక్షణ శాఖ రహస్యాలు వంటి వాటికి భంగం వాటిల్లుతున్న నేపథ్యంలో ఐటీ చట్టం-2000లోని సెక్షన్‌ 69ఏ కింద ఈ యాప్స్‌ను నిషేధించారు. టిక్ టాక్ బ్యాన్ చేయడంతో దాని ప్రభావం చైనాపై కచ్చితంగా పడుతుందని తెలుస్తోంది.