Begin typing your search above and press return to search.

నిషేధం ఎఫెక్ట్‌: స‌మూల మార్పులు చేస్తున్న టిక్‌ టాక్‌

By:  Tupaki Desk   |   11 July 2020 8:30 AM GMT
నిషేధం ఎఫెక్ట్‌: స‌మూల మార్పులు చేస్తున్న టిక్‌ టాక్‌
X
చైనా మూలాలు ఉన్నాయ‌ని అతి పెద్ద జ‌నాభా ఉన్న భార‌త‌దేశం టిక్‌టాక్ యాప్‌ను నిషేధించిన విష‌యం తెలిసిందే. చైనాకు సంబంధించిన 59 యాప్‌ల నిషేధంలో ముఖ్య‌మైన యాప్ టిక్‌టాక్‌. భార‌త‌దే‌శంలో సంప‌న్నుల నుంచి భిక్ష‌గాడి దాక టిక్‌టాక్ యాప్ వినియోగించేవారు. అయితే చైనాతో నెల‌కొన్ని ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆ యాప్‌ల‌ను నిషేధించిన విష‌యం తెలిసిందే. ఈ నిర్ణ‌యంతో టిక్‌టాక్ మాతృసంస్థ‌కు భారీ న‌ష్టం ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం ఈ యాప్‌పై మ‌రికొన్ని దేశాల్లో వ్య‌తిరేక‌త వ‌స్తోంది. అమెరికాలో ఈ యాప్‌పైఊ ఆందోళనలు పెరిగిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌ డాన్స్ దిద్దుబాటు చ‌ర్య‌లు మొద‌లుపెట్టింది. టిక్‌టాక్‌లో‌ సమూలమైన సంస్థాగత మార్పులకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. కొత్త యాజమాన్య బోర్డు, చైనా వెలుపల ప్రత్యేక ప్రధాన కార్యాలయం లాంటి మార్పులు చేసేందుకు టిక్‌టాక్ సిద్ధ‌మైంది. ప్ర‌స్తుతం టిక్‌టాక్‌ ప్రధాన కార్యాలయం చైనా రాజధాని బీజింగ్‌లో ఉన్నాయి. మార్పుల్లో భాగంగా బీజింగ్‌ నుంచి టిక్‌టాక్ కార్య‌క‌లాపాలు తరలించేందుకు సిద్ధమైంది. టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌ డాన్స్‌కి చైనాలో మాత్ర‌మే కార్యాల‌యం ఉంది. మ‌రో చోట ప్రధాన కార్యాలయం లేదు. ఈ నేప‌థ్యంలో టిక్‌టాక్ వ్య‌వ‌హారాలు న‌డిపించేందుకు చైనా కాకుండా వేరే దేశాల్లో కార్యాల‌యం ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింద‌ని స‌మాచారం.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా యాప్ ఉండ‌డంతో ఈ సంద‌ర్భంగా అంతర్జాతీయ కార్యాలయం ఏర్పాటుచేయాల‌ని భావిస్తోంది. దీనికోసం టిక్‌టాక్‌ అనేక ప్రదేశాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే టిక్‌టాక్‌కు లాస్‌ ఏంజెలిస్, న్యూయార్క్, లండన్, డబ్లిన్, సింగపూర్‌లో అతిపెద్ద కార్యాలయాలు ఉన్నాయి. ఇప్ప‌టికే భార‌త్‌, హాంకాంగ్‌లో టిక్‌టాక్ యాప్‌పై నిషేధం ఉంది. తమ దేశంలో యాప్‌ను నిషేధించే యోచనలో ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన విష‌యం తెలిసిందే. లాస్‌ఏంజెల్స్‌ కేంద్రంగా పనిచేసే కొత్త సీఈఓ కెవిన్‌ మేయర్‌కి టిక్‌టాక్ బాధ్యతలను అప్పగించారు. ఈ విధంగా చైనా యాప్ అనే ముద్ర‌ను తొల‌గించుకునే ప‌నిలో టిక్‌టాక్ ఉంది.