Begin typing your search above and press return to search.

ఇంట్లో మొగుడు..టిక్ టాక్ లో రహస్య ప్రియుడు

By:  Tupaki Desk   |   23 Feb 2020 2:30 AM GMT
ఇంట్లో మొగుడు..టిక్ టాక్ లో రహస్య ప్రియుడు
X
ఏదైనా సరే అతిచేస్తే అనర్థాదాయకమే.. ఇది సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను అతిగా ఉపయోగిస్తున్న వారికి అక్షరాల అతికినట్టు సరిపోతుంది. ఈ మధ్యకాలంలో బాగా ప్రచుర్యం పొందిన టిక్ టాక్ యాప్ వల్ల చాలామంది పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే.. మరోవైపు టిక్ టాక్ కు కొందరు మహిళలు బానిసలై కట్టుకున్న వాడిని సైతం లెక్కచేయకుండా అడ్డదారులు తొక్కుతున్న వైనం వెలుగుచూసింది. అప్పటివరకు అన్యొన్యంగా ఉన్న దంపతులు టిక్ టాక్ పుణ్యమా అని విడాకులు తీసుకుంటున్న ఘటన తాజాగా వెలుగుచూసింది.

తమిళనాడులోని వేలూరులో భార్యభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్త ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుంటారు. భార్య భర్తలు సంసారం సాఫీగానే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వివాహిత టిక్ టాక్ కు అలవాటు పడింది. క్రమంగా టిక్ టాక్ లో వీడియోలు చేస్తూ భర్త - పిల్లలను పట్టించుకోవడం మానేసింది. అందంగా తయారై వీడియోలు పెడుతుండడంతో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఆమె వీడియోలకు ఆకర్షితుడైన ఓ యువకుడు ఆమెకు నిత్యం మేసేజ్ లు పెడుతుండేవాడు. తరుచూ వారిద్దరు మాట్లాడుకోవడం - కలుసుకోవడం వల్ల అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.

తనను పట్టించుకోకపోవడంతో అనుమానం వచ్చిన భర్త.. భార్య చేస్తున్న పనులపై కన్నేశాడు. ఆమె ఓ యువకుడితో సంబంధం పెట్టుకుందని తెలుసుకొని వారిని మందలించాడు. ఇక నుంచి టిక్ టాక్ చేయద్దని వార్నింగ్ ఇచ్చాడు. ఇదేమీ పట్టించుకోని భార్య మళ్లీ టిక్ టాక్ చేస్తూ - సదరు యువకుడితో సంబంధం కొనసాగించింది. దీంతో అతను భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇప్పటికే ఆమెకు విడాకుల నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది.

టిక్ టాక్ లో వచ్చే లైకులు.. షేర్లకు మురిసిపోయిన భార్య ఏకంగా ఆ మాయలోపడి పచ్చని సంసారాన్ని కూల్చుకోవడం శోచనీయంగా మారింది. ఈ కోవలోనే చాలామంది మహిళలు టిక్ టాక్ మాయలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వాళ్లు ఎంత త్వరగా మెల్కొంటే అంత మంచిది. లేకపోతే టిక్ టాక్ లు చేయడం మాని కోర్టుల చుట్టూ తిరగాల్సిందే మరీ..