Begin typing your search above and press return to search.
ఆ దేశంలో యువతులు టిక్ టాక్ చేస్తే జైలుకే..!
By: Tupaki Desk | 19 Aug 2020 11:30 PM GMTఈజిప్టులో టిక్ టాక్ వీడియోలు చేస్తున్న యువతులను ఆ దేశ ప్రభుత్వం అరెస్టు చేస్తోంది. వారిని జైలుకు పంపి జరిమానా విధిస్తోంది. వారు చేసిన వీడియోలో అసభ్యత కారణంగానే ఇలా చేస్తున్నట్లు ప్రభుత్వం వాదిస్తోంది. మనదేశంలో మొన్నటివరకు టిక్ టాక్ ను బ్యాన్ చేయకముందు... ఆ యాప్ లో యువతులదే హవా. జనానికి నచ్చే పాటలు, సీన్లు చేసేవారు. ఒకింత మోడ్రన్ డ్రస్సుల్లోనే కనిపించేవారు. కొందరు యువతులు అదేపనిగా యువకులను రెచ్చగొట్టేలా ఎక్స్ పోజ్ చేసేవారు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించలేదు.
మన దేశమే కాదు ఇతర దేశాలు కూడా ఈ విషయంలో మహిళలకు కాస్త స్వేచ్ఛనిచ్చాయి. అయితే ఈజిప్ట్ లో మాత్రం టిక్ టాక్, ఇంస్టాగ్రామ్ లో వీడియోలు పోస్ట్ చేస్తున్న యువతులను అరెస్టు చేస్తున్నారు. ఇటీవల మవడా అనే యువతి టిక్ టాక్, ఇంస్టాగ్రామ్ లో కొన్ని వీడియోలు పోస్ట్ చేసింది. అవి అసభ్యకరంగా ఉన్నాయంటూ ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేయించింది. దీనిపై ఆమె చెల్లెలు రహ్మ మాట్లాడుతూ.. తన అక్క మోడలింగ్లో రాణించాలనుకున్నదే కానీ.. అసభ్యత ప్రదర్శించాలని అనుకోలేదని చెప్పారు. కోర్టు వీడియోలు అసభ్యకరంగా ఉన్నాయని నిర్ధారించడంతో మా అక్క అక్కడే స్పృహతప్పి పడిపోయిందని, తమ తల్లి మంచం పట్టిందని వాపోయారు. మవడానే కాదు మరో నలుగురు యువతులను కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు వారికి జైలు శిక్షతో పాటు రూ.15లక్షల జరిమానా విధించింది. ఈజిప్టులో ఎక్కువగా ముస్లింలు నివసిస్తుంటారు.
అక్కడ టిక్ టాక్ వీడియోలు చేస్తే యువతుల పైన విమర్శలు చేస్తుంటారు. మానవ హక్కుల ఉద్యమకారులు మాత్రం మవడా సహా ఇతర యువతులను కూడా జైలు నుంచి విడుదల చేయాలని ఉద్యమం చేస్తున్నారు. ప్రభుత్వం కావాలనే పేదరికం నుంచి వచ్చిన యువతులకు శిక్షలు వేసి మిగతా సమాజాన్ని, సోషల్ మీడియా వంటి డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ను భయపెట్టి తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటోందని కొందరు విమర్శిస్తున్నారు. కాగా మవడాకు టిక్ టాక్ లో 30 లక్షల మంది, ఇన్ స్టాగ్రామ్ లో 16 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.