Begin typing your search above and press return to search.

ట్విట్టర్ ను వెనుకకు నెట్టిన ఆ సైట్ ?

By:  Tupaki Desk   |   22 May 2020 5:15 AM GMT
ట్విట్టర్ ను వెనుకకు నెట్టిన ఆ సైట్ ?
X
టిక్ టాక్ ..టిక్ టాక్ ..టిక్ టాక్ ..ఈ పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. ప్రస్తుతం సోషల్ మీడియా సైట్స్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. పిల్లల నుండి పెద్దల వరకు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ టిక్ టాక్ లోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. అతి తక్కువ సమయంలోనే అత్యధికమందికి చేరువైన సోషల్ నెట్ వర్క్ ఏదైనా ఉందంటే అది టిక్ టాక్ అనే చెప్పాలి. ఇక పొతే తాజాగా టిక్ టాక్ మరో ఘనత సాధించింది.

టిక్ టాక్ మార్కెట్ విలువ రోజురోజుకి భారీగా పెరుగుతోంది. టిక్ టాక్ మాతృసంస్థ బై డాన్స్ వెలివేషన్ ప్రైవేట్ మార్కెట్లలో 30 శాతం పెరిగి 100 బిలియన్ డాలర్లు (అంటే 7 ,55 ,330 కోట్లు)కి చేరింది. ప్రపంచంలోనే మోస్ట్ వ్యాల్యూబల్ స్టార్టప్ గా నిలిచింది. ఇదే సమయంలో ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీలైన ట్విట్టర్, స్నాప్ వంటి ప్రత్యర్థులను వెనక్కి నెట్టింది. కొత్తగా ఈ కామర్స్, గేమింగ్ వ్యాపారం లోకి అడుగు పెట్టాలని టిక్ టాక్ భావిస్తోంది.

అయితే , ఇలా రోజురోజుకి సంపాదనలో దూసుకుపోతున్న టిక్ టాక్ ని కొన్ని దేశాల్లో బ్యాన్ చేయాలనే వాదనలు కూడా రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దీని వల్ల అనేక మంది అనేక రకాలుగా ఇబ్బందులకు గురౌతున్నారు అని , దీన్ని బ్యాన్ చేయాలనీ కోరుతున్నారు.మన దేశంలో కూడా ఈ టిక్ టాక్ బ్యాన్ చేయాలనే వాదన బలంగా వినిపిస్తుంది. చూడాలి మరి ఏమౌతుందో ...