Begin typing your search above and press return to search.

‘టిక్​టాకర్లు’ అంతరిక్ష పరిశోధనలు కూడా చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   24 March 2021 3:30 AM GMT
‘టిక్​టాకర్లు’  అంతరిక్ష పరిశోధనలు కూడా చేస్తున్నారా?
X
అంగారక గ్రహంపై ఇప్పటికే శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు సాగిస్తున్నారు. అక్కడ నీటి జాడ ఉండేదని ఎప్పటినుంచో పరిశోధనలు సాగుతున్నాయి. తాజాగా అంగారక గ్రహం .. అంతర్భాగంలో నీటి ఊట ఉందని తేలింది. అంతేకాక అక్కడ గతంలో కొలనులు, సరస్సులు ఉన్నాయని కూడా పరిశోధకులు అంటున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఓ టిక్​ టాక్​ చేసుకొనే వ్యక్తి అంగారక గ్రహంపై ఓ వింత వాదన తెరమీదకు తీసుకొచ్చాడు. అతడి వీడియోకు విపరీతమైన వ్యూస్​ వచ్చాయి. ఇంతకీ ఆయన ఏమంటాడంటే.. అంగారక గ్రహంపై గతంలో మనుషుల్లాంటి జీవులు ఉండేవాళ్లట... కొంతకాలానికి అక్కడ అణుయుద్ధాలు జరిగి అందరూ చచ్చిపోయారట. అంతేకాక అంగారక గ్రహం మీద ఉన్న నీటి కొలనులు, సరస్సులు, సముద్రాలు అంతర్భాగంలోకి చొచ్చుకుపోయాట.

నిజానికి ఆ టిక్​ టాక్ యూజర్​ ఏమీ అంతరిక్ష పరిశోధకుడు కాదు. కనీసం ఏం చదువుకున్నాడో లేడో తెలియదు.. కానీ అతడు చేసిన వీడియో మాత్రం సోషల్​మీడియాలో తెగ వైరల్​ అవుతున్నది. అప్పుడప్పుడూ సోషల్​మీడియాలో కొన్ని వార్తలు విపరీతంగా ట్రోల్​ అవుతూఉంటాయి. ఆ వార్తల్లో ఉండే నిజమెంత? అన్న విషయం కూడా ఎవరూ పట్టించుకోరు. విపరీతంగా వైరల్​ అవుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఈ వీడియో కూడా వైరల్​గా మారింది.


‘క్రాక్ హెడ్ జో డర్ట్’ అనే ఓ టిక్​ టాక్​ యూజర్​ తనను తాను అన్నీ ఫన్నీ వీడియోలు చేస్తుంటాడు. ఇటీవల అరుణ గ్రహంపై ఓ వీడియో చేశాడు. పైగా తాను చేసిన ఈ వీడియోను ఓ కాన్స్పిరేసీ థియరీగా వ్యవహరించాడు.

అరుణ గ్రహం ఎందుకు ఎర్రగా మారిందో చెప్పుకొచ్చాడు. కొన్ని కోట్ల ఏళ్ల కింద ఇక్కడ అణుయుద్ధాలు జరిగాయని చెబుతున్నాడు.

ఇదిలా ఉంటే ఈ ప్లానెట్ లో నీటి జాడలు, సహజ వనరులు ఉండేవని, ఇందుకు సాక్ష్యాధారాలు ఉన్నాయని నాసా ఇటీవల ప్రకటించింది. దీంతో సదరు వ్యక్తి ఓ వీడియోను తయారు చేశారు.

శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

అంగారక గ్రహం ఎరుపు రంగును సంతరించుకోవడానికి కారణం న్యూక్లియర్ వేస్ట్ కాదని శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నారు. అంగారక గ్రహం ఉపరితలంపై ఐరన్ ఆక్సైడ్ రస్ట్ పేరుకుపోవడమేనని దానికి కారణమని వాళ్లు చెబుతున్నారు. గాలితో కలిసి ఈ రస్ట్ పరమాణువులు వాతావరణంలో ఎగిరిపోయాయని రీసెర్చర్లు అంటున్నారు. అంగారక గ్రహంపై మనుషుల్లాంటి జీవులు ఉన్నాయి.. అనడానికి ఎటువంటి ఆధారాలు లేవని వాళ్లు చెబుతున్నారు. టిక్​టాకర్లు చేసే వీడియోలు ఊహాజనితమని కొట్టి పారేస్తున్నారు.