Begin typing your search above and press return to search.

పరువు కాపాడిన వ్యక్తికి టికెట్​..! శశికళ స్టైల్​ అది..!

By:  Tupaki Desk   |   14 March 2021 9:10 AM GMT
పరువు కాపాడిన వ్యక్తికి టికెట్​..! శశికళ స్టైల్​ అది..!
X
కష్టాల్లో సైతం తమ వెంట నడిచిన నేతలను .. సందర్భం వచ్చినప్పుడు అందలం ఎక్కించడం, వాళ్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం కొందరు రాజకీయనేతల నైజం. తమిళనాడు రాజకీయాల్లో అటువంటివి ఎక్కువ జరుగుతుంటాయి. ఒకప్పుడు తమిళనాడు రాజకీయాలను శాసించిన చిన్నమ్మ .. అనూహ్య పరిస్థితుల్లో అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఆమె తనకు నమ్మకస్తుడైన పళనిస్వామిని సీఎం కుర్చీ మీద కూర్చొబెట్టింది. కానీ తర్వాత పళనిస్వామి శశికళకు హ్యాండ్ ఇచ్చాడు. నేరుగా తనకు రాజకీయభవిష్యత్​ ఇచ్చిన చిన్నమ్మనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇటీవల శశికళ జైలు జీవితం ముగించుకొని విడుదలైన విషయం తెలిసిందే.

ఫిబ్రవరి 7వ తేదీన శశికళ బెంగళూరు నుంచి చెన్నైకి భారీ ర్యాలీగా ఎంట్రీ ఇచ్చారు. అయితే శశికళ వస్తున్న వాహనానికి అన్నాడీఎంకే జెండా ఉండటంతో పోలీసులు అడ్డగించారు. ఆ పార్టీ నుంచి సస్పెండ్ కావడంతో అన్నాడీఎంకే జెండా పెట్టుకొనేందుకు వీలు లేదంటూ ఆపారు. అయితే అప్పుడు తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే నేత దక్షిణామూర్తి.. శశికళ పరువు కాపాడారు. ఆయన అప్పుడు శశికళ వెనక కార్లో ఉన్నారు. ఈ సందర్భంగా తాను అన్నాడీఎంకే నేతను కాబట్టి తన కారుకు అన్నాడీఎంకే జెండా ఉండొచ్చని పోలీసులకు షాక్​ ఇచ్చారు. ఆ తర్వాత శశికళను తనకారులో ఎక్కించుకొని వెళ్లారు. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది. శశికళను పరువును దక్షిణామూర్తి కాపాడాడటంలూ వార్తలు వచ్చాయి.

శశికళ.. తాజాగా దక్షిణామూర్తికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. అమ్మా మక్కల్ మున్నెట్ర కళగం(ఏఎంఎంకే) తరఫున మాధవరం నియోజవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆయనకు టికెట్ కేటాయించారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు దక్షిణామూర్తికి తెలుపడంతో ఆయన శశికళకు ధన్యవాదాలు తెలిపాడు.తమిళనాడులో ఎన్నికలు మార్చి 12 నుంచి మే 2వ తేదీ వరకు ఒకే విడతలో పోలింగ్ జరనునుంది. ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 12న విడుదల చేయనుండగా, నామినేషన్లకు చివరి తేది మార్చి 19గా నిర్ణయించారు. ఇక నామినేషన్ల పరిశీలనకు మార్చి 20వ తేదీ గడువుగా పెట్టారు. మార్చి 22వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఏప్రిల్ 6న పోలింగ్ నిర్వహించి.. మే 2న ఫలితాలు రానున్నాయి.