Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ కు క‌లిసొచ్చే 'గురువారం'!

By:  Tupaki Desk   |   30 May 2019 4:54 AM GMT
జ‌గ‌న్ కు క‌లిసొచ్చే గురువారం!
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు సెంటిమెంట్లు జాస్తి. ప్ర‌తి విష‌యంలోనూ ఆయ‌న తిధి.. న‌క్ష‌త్రం.. జాత‌కం లాంటివి చాలానే చూస్తుంటారు. కేసీఆర్ తో పోలిస్తే.. జ‌గ‌న్ కు ఈ సెంటిమెంట్లు అంత ఎక్కువ‌గా ఉండ‌వ‌ని చెప్పాలి. అయితే.. జ‌గ‌న్‌కు సంబంధించి ఒక కొత్త సెంటిమెంట్ ఇప్పుడు తెర మీద‌కు వ‌చ్చింది.

జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌నకు గురువారం క‌లిసి వ‌స్తోంది. దీనికి త‌గ్గ‌ట్లే ఇటీవ‌ల కాలంలో చోటుచేసుకున్న ముఖ్య‌మైన ఘ‌ట‌న‌లు అన్ని గురువార‌మే చోటు చేసుకోవ‌టం ఆస‌క్తిక‌ర అంశంగా చెప్పాలి. అనుకోకుండా జ‌రిగిన‌ట్లు క‌నిపిస్తున్న‌ప్ప‌టికి గురువారం ఆయ‌న‌కు బాగా క‌లిసి వ‌స్తున్న‌ట్లుగా అనిపించ‌క మాన‌దు. ఇటీవ‌ల సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్‌.. కౌంటింగ్ మాత్ర‌మే కాదు.. ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం సైతం గురువార‌మే కావ‌టం విశేషం.

అనుకోకుండా జ‌రిగినప్ప‌టికి.. ఇలా జ‌ర‌గ‌టాన్ని కొంద‌రు ప్ర‌స్తావిస్తున్నారు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యేందుకు కార‌ణ‌మైన అన్ని ముఖ్య కార్య‌క్ర‌మాలన్నీ (పోలింగ్ ఏప్రిల్ 11 (గురువారం).. కౌంటింగ్ మే 23 (గురువారం).. ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం మే 30 (గురువారం) ఒకే రోజున చోటు చేసుకోవ‌టం గ‌మ‌నార్హం. దీంతో.. జ‌గ‌న్ కు గురువారం క‌లిసి వ‌స్తుంద‌న్న మాట ఇప్పుడు వినిపిస్తోంది. మ‌రీ..గురువారం సెంటిమెంట్ ను జ‌గ‌న్ గుర్తించారా?