Begin typing your search above and press return to search.
ఆకాశంలో ఒకేసారి 3 సూరీళ్లు.. చైనాలో అరుదైన సీన్.. ఎలా సాధ్యమైంది?
By: Tupaki Desk | 18 Oct 2020 10:40 AM ISTవిశ్వంలో మనకు తెలిసిన వాటి కంటే తెలియని సంగతులు బోలెడన్ని ఉంటాయి. కనీసం ఊహకు కూడా అందని విశేషాల పుట్టగా విశ్వాన్ని చెప్పాలి. ఇక.. ప్రపంచంలోని ఏ దేశంలో అయినా ఆకాశంలో ఒక సూర్యుడు మాత్రమే కనిపిస్తాడు. కానీ.. అందుకు భిన్నంగా ఒకే సమయంలో ఆకాశంలో మూడు సూర్యుళ్లు వెలిగిపోవటం.. అది కూడా ఏ నిమిషమో.. రెండు నిమిషాలో కాకుండా ఏకంగా మూడు గంటలకు పైనే కనిపించటం సంచలనంగా మారింది. ఒక సూరీడికి బదులు ముగ్గురు సూర్యుళ్లు ఎలా సాధ్యం? ఇంతకీ ఈ విశేషం ఏ దేశంలో చోటు చేసుకుంది? అసలు ఇదెలా సాధ్యం? అన్న సందేహాలకు సమాధానాలు వెతికితే..
నిజమే.. ఆకాశంలో ఒకేసారి మూడు సూర్యుళ్లు దర్శనమిచ్చిన అరుదైన ఘటన చైనాలోచోటు చేసుకుంది. ఆ దేశంలోని మోహే నగర ప్రజలకు ఈ అరుదైన ఖగోళ వింత దర్శనమిచ్చింది. అయితే.. చైనా వాళ్ల సుడి ఏమిటంటే.. అప్పుడప్పడు ఆ దేశంలోనివివిధ ప్రాంతాల్లో అప్పుడప్పుడు ఐదు సూర్యుళ్లను కూడా ఒకేసారి వీలు ఉంటుందని చెబుతారు. తాజాగా కనిపించిన మూడు సూర్యుళ్ల వ్యవహారం ఉదయం ఆరున్నరకు మొదలై తొమ్మిదిన్నర గంటల వరకు సాగింది. ఈ అరుదైన సీన్ నుఅక్కడి ప్రజలు ఫోటోలు.. వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
ఇంతకీ ఈ మూడు సూర్యుళ్లలో ఒరిజినల్ సూరీడు ఎవరు? అన్న విషయానికి వస్తే.. రెండింటి మధ్యలో ఉన్నదే అసలైన సూరీడుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి.. మిగిలిన రెండింటిని ఫాంటమ్ సూర్యుళ్లుగా చెప్పాలి. ఈశాన్య చైనాలో ఇలాంటి అప్పుడప్పుడుచోటు చేసుకుంటాయని చెబుతారు. ఇంతకూ అదెలా సాధ్యమన్నది ప్రశ్న. సూర్యుడు చుట్టూ అప్పుడప్పడు వలయం ఏర్పడుతుంది. ఆ సమయంలో మంచు కణాలు.. సూర్యుడుచుట్టూ ఏర్పడతాయి.
అలా ఏర్పడిన వాటిల్లో చాలావరకు కరిగిపోతాయి. మిగిలినవి గుండ్రంలా వలయంలా ఏరపడతాయి. వాస్తవానికి వలయం లోపల అవి ఉండవు. వలయం పక్కన ఆకాశంలో అవి ఉంటాయి. అవి లేని చోట కాంతి ఎక్కువగా.. ఉన్న చోట తక్కువగా ఉంటుంది. మంచుకణాలతో సిర్రస్ మేఘాలు ఏర్పడి.. ఆ మేఘాల మీద సూర్య కిరణాలు పడినప్పుడు సూర్యుడి ప్రతిరూపం ఏర్పతుందని చెబుతున్నారు. దీంతో ఒక సూరీడికి బదులుగా రెండు.. మూడు.. ఐదు.. చొప్పున కనిపిస్తాయి. అయితే.. అవి చాలా తక్కువ సమయమే ఉంటాయి. కానీ.. తాజాగా మాత్రం ఏకంగా మూడు గంటల పాటు ఉండటం విశేషం.