Begin typing your search above and press return to search.

ఆడు మగడ్రా బుజ్జీ: ముగ్గురు పెళ్లాల ముద్దుల మొగుడు..

By:  Tupaki Desk   |   6 Nov 2020 2:20 PM IST
ఆడు మగడ్రా బుజ్జీ: ముగ్గురు పెళ్లాల ముద్దుల మొగుడు..
X
కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎంత సంతోషంగా ఉంటుందో.. ఇప్పుడా మొగాడికి కూడా అంతే సంతోషం. ఒక్క అమ్మాయి దొరక్క ఎంతో మంది గిలాగిలా కొట్టుకుంటుంటే వీడెవడురా బాబూ.. ఏకంగా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు అమ్మాయిలు మనువాడడానికి ఒచ్చారంటే వీడంతా అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరేమో.. అదీ ఆ ముగ్గురు అక్కచెల్లెల్లు కావడం.. మనోడిని మనసుపడి సామరస్యంగా పెళ్లాడడం చూస్తుంటే.. అసలైన సంక్రాంతి అల్లుడు ఇతడే అని చెప్పొచ్చు..

ఉత్తరప్రదేశ్ లోని కర్వా చౌత్ పండుగ సందర్భంగా ఈ వింత వెలుగుచూసింది. చిత్రకోట్ కు చెందిన కృష్ణకు ముగ్గురు భార్యలు. ఆ ముగ్గురు సొంత అక్కాచెల్లెల్లు కావడం విశేషం. ఈ ముగ్గురికి చెరో ఇద్దరు పిల్లలు. వీళ్లంతా కలిసి రామకాలనీలో అనోన్యంగా జీవిస్తున్నారు. ఇన్నేళ్లయినా ఆ కుటుంబంలో గొడవలు లేవు. ఆ ముగ్గురితో సంసారం చేస్తూ ఆరుగురిని పిల్లలను కని కృష్ణ తెగ ఆనందంగా ఉండడం విశేషం. ఒక్క భార్యతోనే తలప్రాణం తోకకొస్తున్న ఈ రోజుల్లో ముగ్గురు పెళ్లాలను మెంయింటేన్ చేస్తున్న ఇతగాడిని చూసి పెళ్లి కాని మగాళ్లంతా గింజుకొని చస్తున్నారు.

శోభా, రీనా, పింకీ.. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు. ఏం చేసినా ఈ ముగ్గురు కలిసే చేస్తారు. కలిసి డిగ్రీ చేశారు. తర్వాత కలిసికట్టుగా ఒక్కడినే మనువాడారు. ఆ లక్కీ ఫెలో కృష్ణనే. ఇది జరిగి 12 ఏళ్లు అవుతోంది.

అత‌డి ముగ్గురు భార్య‌లు చ‌దువుకున్న‌వాళ్లు. వాళ్లు ఎప్పుడూ విడిగా ఉందామ‌నుకోలేదు. క‌లిసి ఉండ‌టంలోనే సంతోషం ఉంద‌‌ని న‌మ్ముతున్నారు. కానీ కృష్ణ‌ ఒకే వేదిక‌పై ఈ ముగ్గురిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడ‌న్న‌ది మాత్రం ఇప్ప‌టికీ అంతు చిక్క‌డం లేదని బంధువులు చెబుతున్నారు. అత‌డు కూడా దీని గురించి ఎప్పుడూ నోరు మెద‌ప‌లేదు" అని చెప్పుకొచ్చారు.

తాజాగా కర్వా చౌత్ పండుగ సందర్భంగా చంద్రుడిని చూసి ఓ జల్లెడను ముగ్గురు భార్యలు భర్త కృష్ణకు చూపించారు. ఈ ఫొటో వైరల్ అయ్యి ఈ ముగ్గురి భార్యల కథ సోషల్ మీడియాలో ఆసక్తిగా మారింది.