Begin typing your search above and press return to search.
టెక్సాస్ లో ఘోర రోడ్డుప్రమాదం.. మనోళ్లు ముగ్గురు మృతి
By: Tupaki Desk | 29 Nov 2020 1:00 PM GMTఅమెరికాలోని టెక్సాస్ లో దారుణ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన మన తెలుగోళ్లు ముగ్గురు మృతి చెందిన విషాద ఉదంతం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని నారాయణ పేట జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. జిల్లాకు చెందిన పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన నరసింహారెడ్డి.. లక్ష్మీ దంపతులకు ఒక అమ్మాయి (మౌనిక).. అబ్బాయి (భరత్) సంతానం. వారిద్దరూ ఉద్యోగం చేస్తూ అమెరికాలోనే స్థిరపడ్డారు.
ఇదిలా ఉండగా.. నాలుగు నెలల క్రితం భార్యభర్తలు ఇద్దరు కొడుకు..కుమార్తె వద్దకు వెళ్లారు. అమెరికాలోని బంధువుల ఇంట్లో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్నకారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో భార్య.. భర్త.. కొడుకు ఘటనాస్థలంలోనే మరణించగా.. కుమార్తె మౌనిక మాత్రం తీవ్ర గాయాల పాలయ్యారు. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ డిపో 1లో నరసింహారెడ్డి ఆర్టీసీ కండక్టర్ గా పని చేస్తున్నారు. వచ్చే నెలలో ఆయన రిటైర్ కావాల్సి ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అమెరికా రోడ్డు ప్రమాదంలో మరణించటంతో వారి స్వగ్రామంలోవిషాద ఛాయలు నెలకొన్నాయి.