Begin typing your search above and press return to search.

వరల్డ్ లో మన లేడీస్ ముగ్గురు పవర్ ఫుల్

By:  Tupaki Desk   |   14 Sept 2016 1:00 AM IST
వరల్డ్ లో మన లేడీస్ ముగ్గురు పవర్ ఫుల్
X
మన ఆడోళ్లు ఎంత శక్తివంతమన్న విషయం ఈ మధ్య ముగిసిన ఒలింపిక్స్ చెప్పకనే చెప్పేశాయి. తాజాగా జరుగుతున్న పారా ఒలింపిక్స్ లోనూ అలాంటి పరిస్థితే చోటు చేసుకుంటోంది. దేశంలో ఇంత మగమహారాజులు ఉన్నా.. ఆడాళ్లు సైతం తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా వ్యవహరిస్తూ తమ సత్తా చాటుతున్నారు. తాజాగా అలాంటి సీన్ మరోసారి తెర మీదకు వచ్చింది.

తరచూ ఏదో ఒక జాబితా విడుదల చేసే ఫార్చ్యూన్ తాజాగా మరో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా లెక్కేమిటంటే.. అమెరికా బయట ఉన్న ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను తయారు చేశారు. ప్రపంచ ఆర్థిక శక్తిని శాసించే సత్తా ఉన్న మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్స్ జాబితాను సిద్ధం చేస్తే.. అందులో మన దేశానికి చెందిన ముగ్గురు మహిళలు చోటు సాధించటం గమనార్హం.

ఈ ముగ్గురూ బ్యాంకర్లు కావటం ఒక విశేషంగా చెప్పాలి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ శక్తివంతమైన మహిళల జాబితాలో మన దేశానికి చెందిన ఎస్ బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య రెండో స్థానంలో నిలవటం గమనార్హం. మొదటిస్థానంలో యూరో జోన్ లో అతి పెద్ద బ్యాంకు అయిన బ్యాంకో స్యాన్ టాన్డర్స్ అధినేత అన బోటిన్ తొలి స్థానంలో నిలవగా.. మన అరుంధతీ భట్టాచార్య రెండో స్థానంలో నిలిచారు.

ఇక.. ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచ్చర్ ఐదో స్థానంలో నిలవగా.. యాక్సిస్ బ్యాంక్ సీఈవో శిఖా శర్మ 19వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ప్రపంచ స్థాయిలో మన మహిళల సత్తా చాటిన ఈ ముగ్గరు లేడీస్ కు కంగ్రాట్స్ చెప్పేద్దాం. ఇప్పటికైనా మహిళల్ని చులకనగా చూసే వారికి.. మహిళల సత్తా తెలుసుకొని వారిని గౌరవించటం నేర్చుకుంటే మంచిది.