Begin typing your search above and press return to search.
బెస్ట్ సీఈవోలు.. మనోళ్లే పనిమంతులు
By: Tupaki Desk | 30 Oct 2019 10:11 AM GMTమైక్రో సాఫ్ట్ సీఈవో ఎవరు..? సత్యా నాదెళ్ల. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సీఈవో ఎవరు..? అదీ మనోడే.. సుందర్ పిచాయ్. వీరిద్దరే కాదు.. అడోబ్ సీఈవో శంతను నారాయణ్, మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్ బంగా వీరేకాదు.. చాలా ప్రపంచ కార్పొరేట్ సంస్థలకు మన భారతీయులే సీఈవోలుగా ఉన్నారు. సత్తా చాటుతున్నారు.
తాజాగా ప్రపంచంలో ఉత్తమ పనితీరు కనబర్చిన బెస్ట్ సీఈవోల జాబితాను ప్రసిద్ధ ‘హార్వర్ద్ బిజినెస్ రివ్యూ’ (హెచ్.బీ.ఆర్) సంస్థ విడుదల చేసింది. ఈ బెస్ట్ సీఈవోలలో ముగ్గురు భారత సంతతి సీఈవోలు చోటు దక్కించుకోవడం విశేషం.
ఈ ఏడాదికి గాను ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థల్లో అత్యుత్తమ పనితీరు కనబర్చిన 100 మంది సీఈవోల జాబితాను హెచ్.బీ.ఆర్ విడుదల చేయగా.. అందులో ముగ్గురు మన భారత సంతతి సీఈవోలు ఏకంగా టాప్ 10లో చోటు దక్కించుకొని సత్తాచాటారు.
ఈ బెస్ట్ సీఈవోల జాబితాలో భారత సంతతికి చెందిన అడోబ్ సీఈవో శంతను నారాయణ్ ఆరోస్థానంలో నిలిచాడు. ఇక మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్ బంగా ఏడోస్థానంలో ఉన్నారు. ఇక మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఇక టాప్ 100లో చూసుకుంటే 89వ స్థానంలో డీబీఎస్ బ్యాంక్ సీఈవో అయిన భారతీయుడు పీయూష్ గుప్తా ఉన్నారు.
ఇక ప్రపంచంలోనే బెస్ట్ నంబర్ 1 సీఈవోగా అమెరికన్ టెక్నాలజీ సంస్థ ఎన్వీడియో సీఈవో బెన్ సెన్ హువాంగ్ అగ్రస్థానాన్ని దక్కించుకోవడం విశేషం. అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ ప్రతీసారి నంబర్ 1లో ఉండేవాడు.. కానీ ఈసారి ఆయన స్థానం పడిపోయింది.