Begin typing your search above and press return to search.
టాప్ టెన్ నివాసయోగ్య నగరాల్లో ఏపీ నుంచి మూడు జిల్లాలు..!
By: Tupaki Desk | 12 Jan 2023 7:00 AM ISTదేశంలోని నివాసయోగ్య నగరాల జాబితాను ప్రతి యేటా కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ విడుదల చేస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల సిటిజన్ పర్సెప్షన్ సర్వే పేరిట దేశవ్యాప్తంగా అత్యంత నివాసయోగ్య నగరాల జాబితాను తయారు చేసింది. ఆయా ప్రాంతాల్లోని ప్రజల అభిప్రాయాల మేరకు ర్యాంకులను కేటాయిస్తూ లిస్టును తయారు చేసింది.
ఈ జాబితాలో దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్య పట్టణాలు చోటు సంపాదించుకున్నారు. ఈ జాబితాలో ఏపీకి చెందిన మూడు నగరాలు చోటు సంపాదించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు.. విజయవాడ.. విశాఖ పట్టణం జిల్లాలు టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నాయి. గుంటూరు 6వ స్థానంలో.. విజయవాడ 8వ స్థానంలో.. విశాఖపట్టణంలో 9వ స్థానంలో నిలిచాయి.
ఈ సర్వేలో గుంటూరు నుంచి 3లక్షల 32వేల 620 మంది ప్రజలు పాల్గొని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఐదు లక్షల నుంచి 10 లక్షల జనాభా కలిగిన నగరాల కేటగిరీలో జాతీయస్థాయిలో గుంటూరు 6వ ర్యాంకు దక్కించుకుంది. విజయవాడ నుంచి 3 లక్షల 32 మంది.. విశాఖపట్నం నుంచి 2లక్షల 88 వేల మంది సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.
గుంటూరు నుంచి 51.37 శాతం మంది ప్రజలు సర్వేలో పాల్గొనడం ఈ నగరానికి బాగా కలిసి వచ్చింది. దీంతో ఈ నగరం జాతీయ స్థాయిలో ఆరో ర్యాంకును సాధించింది. విజయవాడ నుంచి 32.12 శాతం ప్రజలు పాల్గొనగా 8వ ర్యాంకు.. విశాఖపట్నం నుంచి 16.72 శాతం ప్రజలు పాల్గొనగా జాతీయ స్థాయిలో 9వ ర్యాంకును సాధించింది.
ఇక ఈ జాబితాలో మహారాష్ట్రలోని థానే.. కర్ణాటకలోని బెంగళూరు.. మధ్యప్రదేశ్లోని భోపాల్ నగరాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత పింప్రి చించ్వాడ్.. మిరా.. నవీ ముంబై.. కల్యాన్ డోంబివాలి పట్టణాలు సైతం టాప్ 10లో నిలిచాయి. ఈ జాబితాలో గుంటూరు మెరుగైన ర్యాంకును సాధించేందుకు అక్కడి మున్సిపల్ అధికార యంత్రాంగం ముందు నుంచి ప్రత్యేక చర్యలు చేపట్టింది.
ఈ సర్వే ప్రజల్లో అవగాహన కల్పించి ఎక్కువ మంది పాల్గొనేలా చేసింది. గుంటూరు మెరుగైన స్థానంలో నిలిస్తే అభివృద్ధికి నిధులు వస్తాయని ప్రణాళిక బద్ధంగా అధికారులు వ్యవహరించారు. ఈ జాబితాలో మెరుగైన ర్యాంకులు సాధించిన మూడు నగరాలకు చెందిన అధికారులను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. ఇతర ఉన్నతాధికారులు అభినందించారు. ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి సాధించిన విజయం అని మంత్రి ఆదిమూలపు సురేష్ కొనియాడారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.