Begin typing your search above and press return to search.

సినీ తరహాలో చెన్నైలో కాల్పులు .. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

By:  Tupaki Desk   |   12 Nov 2020 1:10 PM GMT
సినీ తరహాలో చెన్నైలో కాల్పులు .. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
X
ఈ మధ్య కాలంలో గన్ కాల్పులు ... సినిమాల్లో కంటే బయటే ఎక్కువగా జరుగుతున్నాయి. సినిమా స్టైల్ లో రావడం, గన్ తీయడం కాల్చడం వెళ్లిపోవడం. ఈ తరహా ఘటనలు ఎక్కువగా అమెరికా లో జరుగుతుంటాయి. కానీ,తాజాగా చెన్నై నగరంలో కూడా ఈ తరహా కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ వ్యాపారి కుటుంబంలో ముగ్గురిని దుండగుడు పొట్టనపెట్టుకున్నాడు.

ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే... చెన్నై పారిన్ కార్నర్‌లోని షాపుకారు పేట కు చెందిన దలీల్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటారు. దుండగులు ఆయన నివాసంలోకి చొరబడిన ఆయనతో పాటు అతని భార్య కుషాల్ భాయ్, కుమారుడు సీతల్ పై కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీపీ మహేష్ కుమార్ అగర్వాల్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ ఘతకానికి ఎవరు పాల్పడ్డారు అనేది పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే తమకు ఎలాంటి తుపాకీ కల్పులు వినపడలేదని అపార్ట్‌మెంట్‌ నివాసితులు తెలిపారు.

అయితే ఈ ఘటనకు కుటుంబ తగాదాలు కారణమా, లేక దలీల్ చేస్తున్నది ఫైనాన్స్ వ్యాపారం కావడం వల్ల వ్యాపార లావాదేవీల్లో శత్రులు ఈ పని చేసి ఉంటారా, అనే విషయాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్న దుండగుడి చిత్రాన్ని పోలీసులు కనుగొన్నారు. అలాగే రాజస్తాన్ కి చెందిన బాబుసింగ్‌ గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘాతుకానికి ఎవరు ఒడిగట్టారనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విభేదాల కారణంగా శిర్షిత్‌ అతని బార్య, పిల్లలతో విడిపోయినట్లు, విడాకుల కేసు కోర్టులో పెండింగ్‌లోఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.